Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఆ హీరో అంటే చైతూకి చాలా ఇష్టం.. ఎందుకో అర్థం కాదు.. సమంత
ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస సక్సెస్‌తో దూసుకెళ్తున్న సమంత అక్కినేని తాజాగా యు టర్న్ రూపంలో మంచి విజయాన్ని అందుకొన్నది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల రాబడుతున్నది. అయితే తమిళ సూపర్స్టార్లు విజయ్, అజిత్ కుమార్లపై కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. అవేమింటంటే..
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌తో నేను తెరీ, కత్తి, మెర్సల్ చిత్రాలు చేశాను. అయితే గతంలో విజయ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. వయసు మీద పడుతున్నప్పటికీ విజయ్ ఇంకా యువకుడిగానే కనిపిస్తాడు. అదే నాకు అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు.
సమంత సినిమా వైపు టర్నింగ్ ఇచ్చుకున్న తెలంగాణ ఏంపీ కవిత (ఫోటో గ్యాలరీ)
ఇక అజిత్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. అదే నాకు అర్థం కాదు. అతడిని ప్రతీ ఒక్కరు అభిమానిస్తారు. అతడ్ని అమితంగా అభిమానించడం వెనుక సీక్రెట్ ఏముందో అర్థం కావడం లేదు. చివరికి నాగచైతన్య కూడా అజిత్‌నే ఇష్టపడుతాడు. అతడంటే చైతూకి చాలా ఇష్టం అని సమంత అన్నారు.
యు టర్న్ తర్వాత సమంత త్యాగరాజన్ కుమారరాజా రూపొందిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.