మరో అగ్ర హీరో నుంచి సమంతకు ఆఫర్.. ఈసారి అంతకుమించి రెమ్యునరేషన్?

అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత సౌత్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రహీరోయిన్ గా కొనసాగేందుకు తన కెరీర్ ను పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం విభిన్నమైన తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఇక కమర్షియల్ గా సమంత అగ్ర హీరోలతో కూడా కొన్ని ప్రాజెక్టులు చేయడానికి చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే సమంత చేతిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు త్వరలోనే లోనే విడుదల కాబోతోంది. అలాగే మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ యశోద సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక వీటితో పాటు సమంత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాను స్టార్ట్ చేసింది.

samantha another offer from kollywood star hero vijay and shocking remuneration

ఖుషి సినిమాని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ లో కూడా ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
అయితే మరోసారి తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా సమంత నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పారితోషికం విషయంలో ఈ బ్యూటీ రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అయితే అంతకంటే ఎక్కువ ఉంటుంది.

ఇక స్టార్ హీరో విజయ్ తో నటించబోయే సినిమాలో సమంత మూడు కోట్లకు పైగానే తీసుకునే అవకాశం ఉందట. ఆ ప్రాజెక్ట్ కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇటీవల విక్రమ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు విజయ్ తో మరో సినిమా చేసేందుకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన మాస్టర్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సమంత విజయ్ తో మరోసారి లోకేష్ చేయబోయే మూవీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X