ఇద్దరికీ కామన్ హీరోయిన్ గా సమంతా..!
ఆ మధ్య 'ఏ మాయ చేసావే' వంటి అందమైన ప్రేమకథను తెరకెక్కించిన గౌతమ్ మీనన్, తాజాగా మరో ప్రేమ కథకు శ్రీకారం చుట్టాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే ఈ చిత్రంలో తెలుగులో రామ్, తమిళంలో జీవా హీరోలుగా నటిస్తున్నారు. రెండు భాషలకు సమంతా కామన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళంలో నిర్మాత, దర్శకుడు రెండు గౌతమ్ మీననే బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. తెలుగులో బెల్లం కొండ సురేష్ నిర్మత. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ నిన్ననే చెన్నయ్ లో ప్రారంభమైంది. 'ఏ మాయ చేసావే'లో సమంతా జెస్సీ పాత్ర పోషించగా, ఇప్పుడిందులో నిత్య పాత్రను పోషిస్తోంది. సమంతా సైకాలజీ స్టూడెంట్ కాగా, రామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఇందులో నటిస్తున్నారు. 'ఇది మీ ప్రేమకథే అయ్యుండచ్చు...' అనే ట్యాగ్ లైన్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్. జీవా హీరోగా నటిస్తున్న సినిమాకు' నీతానే ఏన్ పొన్వసంతమ్" టైటిల్ కూడా ఖాయం అయిందని సమాచారం.


Click it and Unblock the Notifications











