సైకాలజీ స్టూడెంట్ గా సమంత
మహేష్‌బాబు సరసన 'దూకుడు'లో చేస్తున్న ఆమె త్వరలో సైకాజలజీ స్టూడెంట్ గా కనిపించనుంది. ఆమె తాజాగా ఓ త్రి భాషా చిత్రం కమిటైంది. తనను నిలబెట్టిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రం చేస్తోంది. అందులో ఆమె ఈ పాత్రను చేయనుంది. ఈ చిత్రంలో హీరో 21ఏళ్ళ కుర్రాడిగాను, సమంత 20 ఏళ్ళ యువతిగా నటిస్తోంది. హీరో ఇంజినీరింగ్ స్టూడెంట్ కాగా... సమంత సైకాలజీ స్టూడెంట్. ఇప్పటికే తమిళంలో ఈ చిత్రం టైటిల్‌ని ఖరారు చేశారు. 'నీ దానే ఎన్‌పొన్ వసంతం' అనే టైటిల్‌ని నిర్ణయించారు. తొలుత ఈ చిత్రానికి 'నిత్య' అనే టైటిల్‌ని అనుకున్నారు, కానీ ఎందుకో కొంచెం పొయెటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ టైటిల్‌ని ఎంచుకున్నారట గౌతమ్. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా తీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే తమిళంలో జీవా, హిందీలో ఆదిత్యరాయ్ కపూర్ నటించనున్నారు. మూడు భాషల్లోనూ తమిళ్ పొన్ను సమంతనే లీడ్‌రోల్ పోషిస్తోంది. ఈ విషయమై సమంత మాట్లాడుతూ "త్రి భాషా చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. 'ఏ మాయ చేశావె' చిత్రంతో నేను తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా. అందులో నేను పోషించిన జెస్సీ పాత్ర ఎప్పటికీ మరచిపోలేనిది. అందులో నేను నా నటనకంటే ఆ పాత్రను అంత చక్కగా మలచిన దర్శకుడు గౌతమ్ మీనన్‌దే క్రెడిట్ అంతా. ఆయన దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన మంచి స్నేహితుడు. ప్రతి విషయంలోనూ తగిన సలహాలు సూచనలు ఇస్తుంటాడు అంది. అలాగే ఆమె ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం సమంత దృష్టి మొత్తం 'దూకుడు' పైనే ఉంది.


Click it and Unblock the Notifications











