మణిరత్నం దర్శకత్వంలో మహేష్ హీరోయిన్
మణిరత్నం చిత్రంలో ఆఫర్ రావటం అంటే అదృష్టంగా హీరో, హీరోయిన్స్ భావిస్తూంటారు. ఇప్పుడా అదృష్టం సమంతకు దక్కిందని సమాచారం. తమిళ సినీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే త్వరలో ఆమె మణిరత్నం దర్శకత్వంలో నటించబోతోంది. నిన్నటి తరం కథానాయకుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కథానాయకుడిగా మణి ఓ చిత్రం రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో నాయికగా సోనమ్‌కపూర్ దాదాపు ఖరారైనట్లే అని కొద్ది రోజుల కిందటే వార్తలొచ్చాయి. అయితే సోనమ్ కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో సమంతను ఎంచుకొన్నారు. ఈ సినిమా జూన్‌లో మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.
ఇక క్రితం సంవత్సరం ఆమె నటించిన 'దూకుడు' చిత్రం వంద రోజుల మైలురాయి దాటడంతో సమంత ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..''ఆ చిత్రమంతా మహేష్‌బాబు వన్‌మేన్ షో. ఆయన నటన వల్లే అంతటి విజయం దక్కింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మరోసారి ఆయన సరసన నటించడం సంతోషం'' అంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్సకత్వంలో ఓ చిత్రం,రాజమౌళి ఈగలోనూ కీ రోల్ చేస్తోంది. ఈ రెండు చిత్రాలు ఈ సంవత్సరం విడుదల అవుతాయి.


Click it and Unblock the Notifications











