For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్లిక్ బస్సులో నయన్, సమంత ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం.. పక్కనే స్టార్ హీరో కూడా..

  |

  తమిళ దర్శకుడు విష్ణేష్ శివన్ నిత్యం ఏదో ఒక ప్రయోగంతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఏట్రాక్ట్ చేస్తుంటాడు. అయితే నయనతార ప్రేమలో మునిగిన తర్వాత అతడు తన డైరెక్షన్ పై దృష్టి కాస్త తగ్గించినట్లు కూడా టాక్ వచ్చింది. అయినప్పటికీ ఆ రూమర్స్ ను విగ్నేష్ ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓ వైపు నయనతారతో ప్రేమ యాత్రలో కొనసాగిస్తూనే మరోవైపు నిర్మాతగా దర్శకుడిగా కూడా తమిళ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నాడు.

  ఇక ఇటీవల ఈ దర్శకుడు సమంత, నయన తారలతో కలిసి ఒక సినిమా స్టార్ట్ చేశాడు ప్రస్తుతం. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఒక టాలెంటెడ్ నటుడు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  అలాంటి కామెంట్స్ రావద్దని

  అలాంటి కామెంట్స్ రావద్దని

  నయనతార ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవాలని అడుగులు వేస్తూ ఉంటుంది. సొంత ప్రొడక్షన్ లోనే విగ్నేష్ కు అవకాశం ఇప్పించి హీరోయిన్ గా కూడా నటిస్తోంది. రీసెంట్ గా కాతు వాకులా రెండు కాదల్ అనే సినిమాను మొదలు పెట్టారు. నయన్ మొదట ఈ సినిమా కాకుండా చేయకూడని అనుకుందట. ఎందుకంటే భర్త దర్శకత్వంలోనే ఆమె ఎక్కువ సినిమాలు చేస్తూనే కామెంట్స్ ఏ మాత్రం రాకూడదని మరొక హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించిందట. కానీ విగ్నేష్ మంత్రం ఆ పాత్రకు నువ్వైతేనే సరైన న్యాయం చేయగలరని బలంగా ఒప్పించినట్లు తెలుస్తోంది.

  మరొక ముఖ్యమైన పాత్రలో సమంత

  మరొక ముఖ్యమైన పాత్రలో సమంత

  ఈ సినిమాలో కేవలం నయనతార మాత్రమే కాకుండా మరొక ముఖ్యమైన పాత్రలో సమంత కూడా కనిపించబోతోంది. ఈ ఇద్దరి పాత్రలు సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

  ఇదివరకే సమంతా నయనతార ఇద్దరూ కూడా సోలోగా తమిళ ఇండస్ట్రీలో వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

  ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణం

  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల గోవాలో జరిగింది ఇక సినిమా సెట్స్ నుండి లీక్ అయిన వీడియో నుండి ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, సినిమాలో ముగ్గురు నటీనటులను మనం చూడవచ్చు. వారు బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్నారు. 1988 చిత్రం సత్యలోని పాపులర్ పాటను చిత్ర యూనిట్ రీ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెల్లటి పూల చీరలతో, సమంత, నయనతార ఇద్దరు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  నయన్ పెట్టుబడులు

  నయన్ పెట్టుబడులు

  ఇక మరోవైపు విజయ్ సేతుపతి కూడా వారితో పాటు పర్ఫెక్ట్ లుక్ తో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తెల్లటి చొక్కా, నల్ల ఫార్మల్ ప్యాంటు, బ్లాక్ టై ధరించిన సేతుపతి క్లాస్ లుక్ తో అదరగొట్టేసాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మొత్తం సీక్వెన్స్ కదిలే బస్సుతో షూట్ చేయబడుతోంది.రౌడీ పిక్చర్స్ - సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకాలపై విఘ్నేష్ శివన్, నయనతార మరియు లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో విగ్నేష్ శివన్ కు మంచి సక్సెస్ ఇవ్వాలని నయన్ భారీగా పెట్టుబడులు పెట్టిందట. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Samantha & Nayanathara Traveling On Footboard Of A Moving Bus with vijay sethupathi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X