ప్లీజ్..లిప్ టు లిప్ కిస్ కోసం బలవంతం చేయద్దు: సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో తెలుగునాట మాయ చేసిన సమంత తాజాగా లిప్ టు లిప్ కిస్ ల పట్ల తనకి ఉన్న అయిస్టతని తెలియచేసారు. కొందరు దర్శకులు అదే పనిగా కథలో సంభందంలేకపోయినా కిస్ సీన్ తగిలించి కథలు వినిపిస్తున్నారని, అందుకే తాను క్లియర్ గా చెప్తున్నానని ఆమె స్పందించింది. అలాగే తన మొదటి సినిమాలో ముద్దు సీన్ లో యాక్ట్ చేయటానకి కారణం కేవలం..గౌతమ్ మీనన్‌పై ఉన్న గౌరవంతోనే అని నిక్చచ్చిగా తేల్చి చెప్పింది. ఈ చిత్రంలో లిప్ టూ లిప్ ముద్దు సన్నివేశంలో చెప్పారు..తీసారు...అయినా గౌతమ్... ఆ సన్నివేశాన్ని ఆయన చాలా కళాత్మకంగా చిత్రీకరించారు. అయితే ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించేది లేదని వెల్లడిం చారు. తాను సినిమాల్లో నటించడానికి మొదట తల్లిదండ్రులు నిరాకరించినా ఏమాయ చేసావే చిత్రం చూసిన తరువాత పచ్చజెండా ఊపినట్టు చెప్పారు. బానా కాత్తాడి చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని అన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నానని, మంచి స్క్రిప్ట్ దొరికితే తమిళంలో నటిస్తానని సమంత అంటున్నారు.తమిళంలో చేయమంటూ కొంత మంది దర్శకులు ఈ ముద్దు సీన్ కండిషన్ పెట్టడంతో సమంత ఇలా స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











