శంకర్ చిత్రం నుంచి సమంత ఔట్?

By Bojja Kumar

ప్రముఖ దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కలయికలో వస్తున్న 'ఐ' చిత్రంలో దాదాపుగా సమంత ఖరారు అయ్యిందని వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే శంకర్ మాత్రం సమంత కథానాయిక అని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా చెన్నయ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం నుంచి సమంత తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు తన బ్లాగ్ లో ప్రకటించినప్పుడు కూడా సమంత పేరుని ప్రకటించకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.

సమంతను హీరోయిన్‌గా అనుకున్న మాట వాస్తవమే కానీ...ఆమె ఇప్పటికే కమిటైన సినిమాల కారణంగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయిందని తెలుస్తోంది. సమంత ప్రస్తుతం బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఈగ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జులై 6న విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు ఆమె గౌతం మీనన్ దర్శకత్వంలో ఒకే సినిమాను మూడు బాషల్లో ముగ్గురు హీరోలతో చేస్తోంది. తెలుగులో 'ఎటో వెళ్లి పోయింది మనసు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని హీరో. మరో వైపు రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంతో పాటు, మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలోనూ నటిస్తోంది. ఇవేకాక నాగచైత్యతో ఆటో నగర్ సూర్య చిత్రంతో పాటు తమిళంలో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయింది.

'ఐ' చిత్రం విశేషాల్లోకి వెళితే... ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 70 కోట్లతో ప్లాన్ చేస్తున్నారని చెన్నయ్ సినీ వర్గాల సమాచారం. ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా శంకర్ ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగిన విధంగా ప్రేక్షకులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఇందులో ఎఫెక్ట్స్ వచ్చేలా శంకర్ ప్రయత్నిస్తున్నారు.

'ఐ' చిత్రానికి ప్రఖ్యాత సినిమాటో గ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది. 'మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X