సిద్దార్ధతోనూ రొమాన్స్ కు సై అన్న సమంత..
ఏ మాయ చేసావె చిత్రంతో పరిచయమైన సమంత వరసగా పెద్ద హీరోల సరసన ఆఫర్స్ సంపాదిస్తోంది. తాజాగా సిద్దార్ధతో జతకట్టడానికి కమిటయ్యింది. యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందే తమిళ, తెలుగు చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. తమిళంలో ఈ చిత్రం టైటిల్ 'పుతం పదు కలై' తెలుగులో ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాజెక్టుని సత్యం సినిమాస్ కిరణ్ రెడ్డి, ఆగల్ పిల్మ్స్ సి.శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మేజర్ పార్ట్ యుఎస్ లో జరగనుంది. ఇండోర్ షూటింగ్ మలేషియాలో చేస్తారు. కెమెరా మెన్ గా కెటి బాలసుబ్రమణ్యమ్ ని ఎంపిక చేసారు. రెడ్ కెమెరా తో దీన్ని షూట్ చేస్తారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిద్దార్ధ...సూర్యప్రకాశరావు రూపొందిస్తున్న సోషియో పాంఠసీ చిత్రంలోనూ, బావ అనే చిత్రంలోనూ చేస్తున్నారు. అలాగే సమంత ఎన్టీఆర్ సరసన బృందావనంలోనూ, దశరధ్,ప్రభాస్ కాంబినేషన్ చిత్రంలోనూ, శ్రీనువైట్ల, మహేష్ సినిమాలోనూ కమిటైంది.


Click it and Unblock the Notifications











