ముద్దు సీన్ కోసం హీరో పట్టు...నో అన్న సమంత

By Srikanya

చెన్నై : హీరోయిన్ తో గాఢమైన లిప్ లాక్ సీన్ లేకపోతే హీరోలకు కిక్ వస్తున్నట్లు లేదు. రీసెంట్ గా ప్రతీ స్టార్ హీరో సినిమాలోనూ ఓ లిప్ లాక్ కిస్ చోటు చేసుకుంటోంది. డైరక్టర్స్ కూడా హీరోని ఒప్పించటానికి ఓ ముద్దు సీన్ సినిమాలో ఉండేటట్లు చూసుకుంటున్నారు. అయితే కొందురు హీరోయిన్స్ మాత్రం ఇటువంటి వేషాలు తమ దగ్గర కుదరవని చెప్పేస్తున్నారు. అలాంటి పరిస్ధితి తాజాగా ఆర్యకు ఎదురైంది. సమంతను హీరోయిన్ గా అనుకుంటే..అంతా ఓకే కానీ ముద్దు సీన్ మాత్రం చెయ్యనని ఖచ్చితంగా చెప్పేసింది.

వివరాల్లోకి వెళితే..తాజాగా మగిళ్‌తిరుమేని దర్శకత్వంలో నటించేందుకు తమిళ హీరో ఆర్యగ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు. కథ పూర్తిగా వినిపించిన అనంతరం సినిమాలో ముద్దు సన్నివేశం ఉందని చెప్పాడట దర్శకుడు. ఈ కథకు అలాంటి సన్నివేశం అవసరం లేదు. ఉన్నా నటించనని ఖరాఖండిగా చెప్పిందట సమంత. ఆర్య కోసం దానిని జోడిస్తున్నామని దర్శకుడు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా అంగీకరించలేదు.

దాంతో విషయం హీరోగారి వరకూ వెళ్లింది. సమంతతో చేస్తే బిజినెస్ పరంగా క్రేజ్ మాత్రమే కాక తనకూ మైలేజ్ ఉంటుంది. దాంతో రకరకాలుగా ఆలోచనలు చేసి...చివరకు..ముద్దు కన్నా సినిమాల్లో సమంత నటించటమే ముద్దు అని ఫిక్స్ అయ్యి.... ఆర్య 'ముద్దు సీను వద్దులే..' అన్నాడట. దాంతో దర్శక,నిర్మాతలు ఊపరి పీల్చుకున్నారు.

ఇత కోలీవుడ్‌లో అల్లరి హీరో ఎవరంటే తప్పకుండా ఆర్య పేరే చెబుతారు. అందుకు తగ్గట్టే ఆయన ప్రస్తుతం 'సేట్త్టె'(అల్లరి, ఆకతాయి)లో నటిస్తున్నాడు. ఇందులో నటి అంజలితో గాఢ ముద్దు సన్నివేశంలో నటించాడు. ప్రారంభంలో అంజలి అంగీకరించకపోయినా.. ఆ తర్వాత ఒప్పేసుకుంది. హన్సికతోనూ ముద్దుసీనులో నటించాడు. ఇలా హీరోయిన్స్ అందరితో వరస పెట్టి ముద్దు సీన్స్ లాగించే పనిలో ఉన్నాడు ఆర్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X