సమంతకు చికిత్స కారణంగా షూటింగ్ ఆపాం
చెన్నై : ఈ పాత్రకు సరిపోయే హీరోయిన్ సమంత మాత్రమే. సమంత రావడం ఆలస్యమైనా ఆమెకోసం వేచిచూశాం. చికిత్స కారణంగా కొన్ని రోజుల పాటు.. షూటింగ్ ను ఆమెకోసం ఆపాం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది అంటున్నారు ప్రముఖ దర్శకుడు లింగు స్వామి. రన్, పందెం కోడి,అవారా చిత్రాలతో తెలుగువారికి సైతం పరిచయమైన ఆయన తాజాగా సూర్య,సమంత కాంబినేషన్ లో 'అంజాన్' చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.
లింగుస్వామి మాట్లాడుతూ... '' సూర్య తో ఎప్పటినుంచో సినిమా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నా. చాలా అవకాశాలు చేజారిపోయాయి. అదృష్టంకొద్దీ 'అంజాన్' కథను విన్నాక ఆయన నటిస్తానని ఒప్పుకున్నారు. కథను కాస్త మార్చమని చెప్పారు. తొలిసారి, రెండోసారి కథకు కాస్త మార్పులు చేసి తీసుకెళ్లాను. కానీ అప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఆఖరికి మూడోసారి కథను మార్చి వినిపించా. అలాగే తెరకెక్కిద్దామని చెప్పారు అన్నారు.
ఇక ముంబయిలోసాగే కథ అయినందువల్ల డాన్ కథా? అని అడుగుతున్నారు. రొటీన్ కథ మాత్రం కాదు. ఇందులో పలువురు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. అతుల్‌కులకర్ణి, మిలిందమోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎన్నో పేర్లను పరిశీలించాక.. 'అంజాన్' పేరుపెట్టాం. అనుకున్నట్టే సినిమా చక్కగా వస్తోంది అని చెప్పారు.
సింగం-2 తర్వాత లింగుస్వామి, గౌతం మీనన్ లతో కలిసి చేసే రెండు ప్రాజెక్టుల్లో సమాంతరంగా నటించనున్నట్లు గతంలో సూర్య ప్రకటించినప్పటికీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో గౌతం మీనన్ దర్శకత్వంలో కమిటైన 'దృవ నచ్చిత్తిరం' సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు సూర్య. ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.
సింగం-2 భారీ విజయం సాధించడంతో సూర్య తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంత కాలం వరకు ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలను మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు సూర్య. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో చేయబోయే సినిమా కమర్షియల్ కోవకు చెందినదే అంటున్నారు.


Click it and Unblock the Notifications












