హాట్ న్యూస్: భారీ ఆఫర్ చేజిక్కించుకున్న సమంత

By Srikanya

ఇప్పుడు సమంత హవా నడుస్తోంది. ప్రతీ పెద్ద హీరో,దర్శకుడు ఆమెనే హీరోయిన్ గా కోరుకుంటున్నారు. దాంతో నిర్మాతలు ఆమె డేట్స్ నానా తంటాలు పడుతున్నారు. ఆమె డేట్స్ తెచ్చుకుంటే చాలు తాను డేట్స ఇస్తాననే పెద్ద హీరోలు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎంతుందో గమనించవచ్చు. ఈ నేపధ్యంలో ఆమె తాజాగా ఓ భారీ ఆఫర్ ని చేజిక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నారు.

సౌతిండియా స్టార్ డైరక్టర్ శంకర్ తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆయన తన తదుపరి చిత్రంలో విక్రమ్ ని హీరోగా ఎన్నుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్.రహమాన్ అందిస్తున్నారు. పి.సి శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకే సారి రూపొందనుంది. విక్రమ్,సమంత కాంబినేషన్ అంటే తెలుగు,తమిళం రెండింటిలో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ తో దసావతారం వంటి భారీ బడ్జెట్ లు రూపొందించిన రవిచంద్రన్ ఈ చిత్రాన్ని కూడా ఓ రేంజిలో రూపొందించనున్నారని సమాచారం. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. విక్రమ్ సైతం కమర్షియల్ హిట్ కు మొహం వాచి చాలా కాలం అయ్యింది. ఆయన సినిమాలు వస్తున్నాయి..పోతున్నాయి అన్నట్లు గా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దాంతో ఈ కాంబినేషన్ పై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు.

శంకర్ గతంలో విక్రమ్ తో ఆయన అపరిచితుడు చిత్రం రూపొందించారు. మల్టి పర్శనాలిటీ డిజార్డర్ కంప్లైంట్ కి,సామాజిక అంశాన్ని కలిపి చేసిన ఆ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్టైంది. ఇప్పుడదే స్పూర్తితో మరో అద్బుతమైన కథతో ఆయన మరో చిత్రం రూపొందించనున్నారని తమిళ మీడియా అంటోంది. శంకర్ సైతం త్రి ఇడియట్స్ రీమేక్ కావంటంతో తన స్వంత కథతో మరో హిట్ కొట్టి తన అభిమానులను ఆనందపరచాలని ఉవ్విళ్లూరుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X