సమంత కమిటైన కొత్త చిత్రం డిటేల్స్
చెన్నై : స్టార్ హీరోయిన్ సమంత జోరు పెంచింది. తెలుగులోనే కాక తమిళంలోనూ వరస సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకువెళ్తోంది. తాజాగా మరో చిత్రం కమిటైంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఆమె కొత్త చిత్రం ఒప్పుకుంది.
మరో ప్రక్క సూర్య తన కొత్త చిత్రం విడుదలకు ముందే రెండో చిత్రాల్లో నటించేందుకు అంగీకరించాడు. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం సింగం. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన సింగం-2 జూలై 5న విడుదల కానుంది.
సింగం-2 సెట్స్‌పై ఉండగానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ధ్రువనక్షత్రం' అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు సూర్య. ఆయనకు జంటగా అమలాపాల్ పాడిపాడనుంది. దీంతోపాటు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు సూర్య.
ఇందులో ఆయనకు జోడీగా సమంతను ఎంపిక చేశారు. వీరిద్దరు తొలిసారి జంటగా నటిస్తున్నారు. ధ్రువనక్షత్రంతో పాటు దీన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












