హీరోయిన్ కి-దర్శకునికి మధ్య ఉన్న అనుబందమే మాది..?!
తొలి చిత్రం తోనే యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత తరువాత జూ ఎన్టీఆర్ తో కలిసి బృందావనం లో తన అంద చందాలతో అధరగోట్టింది. మొదటి చిత్రం
'ఏ మాయ చేసావె" చిత్రం ద్వారా సమంతను కథానాయికను చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. అందుకని అతనంటే సమంతకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగులో నాని, తమిళంలో జీవా, హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ ఈ మూడు భాషల్లో ముగ్గురు హీరోలు నటిస్తుండగా, మూడు భాషల్లోనూ సమంతే హీరోయిన్ గా నటిస్తోంది. సమంతకు గౌతమ్ మీనన్ ఎంత చెబితే అంత అని దాదాపు అతని కస్టడీలో ఉన్నట్టే లెక్క అని పరిశీలకులు అంటున్నారు. కానీ ఈ వార్తలను సమంత ఖండిస్తోంది. ఓ దర్శకుడికి, హీరోయిన్ కి ఉండాల్సిన అనుబంధమే తమ మధ్య ఉందని, కథానాయికను చేసినంత మాత్రాన నన్ను గౌతమ్ తన కస్టడీలోకి ఉంచుకోవాలని అనుకోవడంలేదని స్పష్టం చేసింది.
కాగా మహేస్ బాబు సరసన నటించిన సమంత దూకుడు హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుసగా హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. ఈ ఆనందంలో బారీ ఆఫర్లు వస్తున్నాయంటోంది. అయితే తొందర పడి ఏ నిర్ణం తీకోలేదు. కథ నచ్చితేనే ముందుకెళుతానంటోంది.


Click it and Unblock the Notifications











