సమంత నిర్ణయం మంచిదేనా?
చెన్నై: హీరోలకు, నిర్మాతలకు లక్కీ హ్యాండ్ గా మారిన సమంత...త్వరలో నిర్మాతగా గా కూడా మారనుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కోలీవుడ్ లో నిజానికి పెద్ద సక్సెస్ లేకపోయినా ఆమె దృష్టి మొత్తం అక్కడే ఉంది. ఎలాగైనా అక్కడ గెలవాలని చూస్తోంది. అందులో భాగంగానే నిర్మాతగా మారుతోందంటున్నారు. అయితే ఈ విషయమై పూర్తిగా సమంత వైపు నుంచి అథికారిక సమాచారం లేదు. దాంతో కొందరు దీన్ని గాసిప్స్ అని కొట్టిపారేస్తున్నారు. ఈ వార్త ఎలా పుట్టిందీ అంటే..

ఇటీవల ఓ దర్శకుడు ఆమెను కలిసి కథ వినించగా... ఆమెకు బాగా నచ్చిందంట. నటించడానికి అంగీకరించకుండా చిత్రీకరణ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?, ఎంత బడ్జెట్ అవసరం? వంటి విషయాలను మాత్రమే తెలుసుకుందట. దీంతో ఆమె ఆ సినిమా నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. నేటి తరంలో విశాల్, సూర్య వంటి హీరోలు నిర్మాతల అవతారమెత్తారు. ఇప్పుడు హీరోయిన్ల నుంచి సమంత కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయా.. అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సమంత...విజయ్ సరసన కత్తి', విక్రమ్ సరసన పత్తు ఎణ్ణురదుకుల్లే' చిత్రాల్లో నటిస్తోంది. సూర్యతో నటించినుఅంజాన్' (తెలుగు సికిందర్) భారీ అంచనాలతో విడులైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం కత్తి'పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సమంత నిర్మాతగా మారనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపించాయి.


Click it and Unblock the Notifications











