twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: కమెడియన్‌ని పెళ్లాడతానన్న సమంత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ సమంత ఇటీవల తమిళ మూవీ ‘కత్తి' ఆడియో వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్రంలో నటించిన కమెడియన్‌ని పెళ్లాడతానంటూ కామెంట్స్ చేసింది. ఆమె మాటలు విన్న జనాలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు సరదాగా చేసినవే అని తేలడంతో లైట్ తీసుకున్నారు.

    ఆ చిత్రంలో కమెడియన్ గా నటించిన సతీష్ అనే యాక్టర్ పెళ్లంటూ చేసుకుంటే సమంత లాంటి అందగత్తెనే చేసుకుంటానంటూ వ్యాఖ్యానించాడు. తన అందం గురించి పొగడటంతో పొంగిపోయిన సమంత....అతనొప్పుకుంటే నేను రెడీ అంటూ టంగ్ స్లప్పయింది. వెంటనే తేరుకుని జస్ట్ ఫర్ ఫన్ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

    Samantha Wants to Marry Comedian

    ‘కత్తి' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

    విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

    English summary
    Vijay’s starrer Kaththi audio was launched recently in a grand manner. The event was attended by Samantha, Vijay, Murugadoss, Anirudh and comedian satish. Samantha Wants to Marry comedian Satish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X