తెగేసి స్పీచ్ ఇస్తున్న సమీరా రెడ్డి
హాట్ గర్ల్ సమీరా రెడ్డి బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ప్రస్తుతం తమిళంలో మంచి అవకాశాలొస్తున్నాయి. తనకు కావలసింది కూడా అదే తను ఎప్పుడూ సినిమా షూటింగ్ తో బిజీగా వుంటూ, లైఫ్ ను ఎంజాయ్ చేయడంమంటే తనకు చాలా ఇష్టం అంటోంది. అంతే కాకుండా గోల్ఫ్ ఆడటం అంటే కూడా చాలా ఇష్టం అని చెబుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో 'గజిని" సూర్య సరసన నటించుటకు తర్వాతి సినిమా 'అజిత్" సరసన నటించుటకు ఒప్పందాలు చేసుకొన్నదని సినిమా వర్గాలు తెలియజేశాయి. ఒక ప్రక్క సినిమా అవకాశాలను చేజారకుండా ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదంటూనే డేటింగ్ కి రెడీ అవుతోందంట. ఇప్పటికే చాలా లేటయిపోయింది. ఆలస్యం చేస్తే ఉపయోగం ఉండదని ఈ ముద్దుగుమ్మ తను డేటింగ్ చేయబోయే బాయ్ ఫ్రెండ్ లక్షణాలు ఎలా ఉండాలో చెప్పమంటే సస్పెన్స్ అంటోంది. తన జీవితం బ్లాక్ అండ్ వైట్ అని తను డేటింగ్ చేయబోయే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ వాడైనా పర్వాలేదు. అయితే ఆ వ్యక్తికి ఫస్ట్ డబ్బున్న వాడు అయి ఉండాలని అంటోంది. మాది వ్యాపార కుటుంబమే అయినప్పటికీ పెద్ద తారల్లా క్రికెట్ టీముల్ని కొనుక్కునేంత డబ్బు లేదు. తాను కూడా చాలా ఎదగాలంటే డబ్బున్న వాడితోనే డేటింగ్ చేస్తానని నిర్మొహమాటంగా తెగేసిచెబుతోంది.


Click it and Unblock the Notifications











