»   » సమీరా రెడ్డిని సెక్స్ వర్కర్ చేస్తున్న గౌతం మీనన్

సమీరా రెడ్డిని సెక్స్ వర్కర్ చేస్తున్న గౌతం మీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు చిత్రాలు చిరంజీవితో జై చిరంజీవ చిత్రాన్ని చేసిన సమీరా రెడ్డి ఆ తర్వాత డైరక్ట్ తెలుగు చిత్రం చేయలేదు. బాలీవుడ్ లోనూ అవకాశాలు తగ్గినామె తమిళ పరిశ్రమపై దష్టిపెట్టింది. తాజాగా ఆమె గౌతం మీనన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని చిత్రంలో సెక్స్ వర్కర్ గా చేస్తోంది. ఓ రాత్రి జరిగే కథ ఇదని, ఓ కొత్త వ్యక్తితో ఓ వేశ్య కి జరిగే అనుభావాల సమాహారమేనని ఈ చిత్రం కధ గురించి చెప్తున్నారు. ఇంతకు ముందు గౌతం మీనన్ దర్శకత్వంలో ఆమె సూర్య సరసన సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే చిత్రంలో చేసింది. ఇక ఈ కొత్త చిత్రం పిబ్రవరి 26 నుంచి ప్రారంభమవుతోంది. ఆయన తాజాగా నాగచైతన్యతో చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం గురించి గౌతం మీనన్ ఇది ఓ ధ్రిల్లర్ అని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ప్రేక్షకులు చూసే విధంగా స్క్రిప్టు రూపొందించానని చెప్తున్నారు. అలాగే కీలక పాత్రలో హీరోయిన్ మహేశ్వరి సోదరుడు సతీష్ కనిపించనున్నాడు. పాటలు లేకుండా కేవలం తొంబై నిముషాల నిడివితో ఈ చిత్రం రూపొందించి విడుదల చేయాలని గౌతం మీనన్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అయి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X