ఆక్సిజన్ అందక సమీరా రెడ్డి ఇబ్బంది
సమీరా రెడ్డి ఆక్సిజన్ సమస్యతో బాగా ఇబ్బంది పడిందనేదే ఇప్పుడు తమిళ మీడియాలో హాట్ న్యూస్. రెండు వారాలు క్రితం జరిగిన ఈ సంఘటన ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసంగా మారింది. వివరాల్లోకి వెళితే తాజాగా ప్రభుదేవ దర్శకత్వంలో విశాల్ సరసన నటిస్తున్న 'వెడి' (తెలుగు 'శౌర్యం' రీమేక్) చిత్రం షూటింగ్‌లో కూడా చాలా ఇబ్బంది పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే లడక్‌లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో రెండు వారాల పాటు జరిగిందట. ఈ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటంతో అక్కడ సమీరారెడ్డికి ఆక్సిజన్ అందక నానా అవస్థలు పడింది. ప్రభుదేవా సమీరా సమస్యను గమనించి వెంటనే ఆక్సిజన్ మాస్క్ ఏర్పాటు చేయించాడట.
ఇలా షూటింగ్ జరిగిన రెండు వారాలు సమీరారెడ్డి ఆక్సిజన్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతూనే ఉంది. అంతేకాదు... అక్కడ తగినంత ఉష్ణోగ్రతలు లేకపోవడంతో సమీరా చలితో వణికి పోయింది.ఇదిలా ఉంటే ఆ మధ్య 'వేట్టై' చిత్రం షూటింగ్ సందర్భంగా బైకు యాక్సిడెంట్‌లో గాయపడి ఆసుపత్రిపాలైంది. రెయిన్‌సాంగ్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునో ఏమో గానీ ఇక నుంచి యాక్షన్ చిత్రాల్లో కాకుండా... కాస్త రొమాన్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాలవైపే మొగ్గు చూపుతానని ఇటీవల ప్రకటించింది సమీరా రెడ్డి.


Click it and Unblock the Notifications











