సమరా రెడ్డికీ, అర్ధరాత్రి కుక్కలతో సంభందం ఏమిటి?

By Srikanya

అశోక్, జై చిరంజీవ చిత్రాలు తెలుగునాట చేసిన సమీరా రెడ్డి ప్రస్తుతం తమిళంలో ఓ సస్పెన్స్ ధ్రిల్లర్ చిత్రం చేస్తోంది. ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగులో హాట్ డైరక్టర్ గా మారిన గౌతం మీనన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ విషయానికి అర్ధరాత్రి కుక్కలకూ సంభధం ఏమిటీ అంటే...ఈ తాజా చిత్రం తెలుగు టైటిల్ అది. తమిళంలో ఈ చిత్రానికి నడునిశి నాయిగల్ అనే టైటిల్ పెట్టారు. ఈ పదాలని తెలుగులో ట్రాన్స్ లేట్ చేస్తే అర్ధ్రరాత్రి కుక్కలు అని వస్తంది. ఇక ఇంతకుముందు సమీరా రెడ్డితో గౌతం..సూర్య సన్నాఫ్ కృష్ణన్ చేసారు కానీ సమీరాకు కలిసి వచ్చింది లేదు. అయితే ఈ చిత్రం ద్వారా అందరికీ చేరువవుతానని ఆమె ఆశిస్తోంది. అలాగే ఈ చిత్రంలో సమీరారెడ్డి, వీరబాహు ప్రధాన పాత్రధారులు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ తరహా కథాంశంతో అల్లుకొంటున్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందట ఈ చిత్రం. నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 'నడునిసి నాయిగల్' కథను సిద్ధం చేశారు. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస అందిస్తున్నారు.ఈ చిత్రం అనంతరం గౌతం మీనన్..నాగార్జున హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున సోదరి నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X