పోలీసుల చేతిలో పడి గోలెత్తిన సమీరా రెడ్డి
ఎన్టీఆర్ తో అశోక్ చిత్రంలో చేసిన సమీరా రెడ్డి తాజాగా పోలీసుల చేతికి చిక్కి తన్నులు తిని గెంటివేయబడి అవమానం పాలయింది. అయితే ఈ సంఘటన మలేషియాలోని కౌలాంలపూర్ లో జరిగింది. ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం అక్కడకి వెల్ళిన ఆమె ఓ స్టార్ హోటల్ లో దిగింది. అక్కడ చాలా మంది మలేషియన్స్ ఆ హోటల్ లో దిగారు. ఓ రోజు ఉదయం లిప్ట్ దిగుతూండగా కొందరు మనుషులు వచ్చి ఆమెను అనుమానించి వారి భాషలో కొన్ని ప్రశ్నలు అడిగారు. సమీరా దానికి బదులు చెప్పలేదు. దాంతో కాలిన వారు లిఫ్ట్ నుంచి బయిటకు లాక్కొచ్చారు. బలవంతంగా లాగటానికి మీరెవరు అని ఆమె అరవటంతో రెండు వేసారు. అయితే ఈలోగా యూనిట్ కారు డ్రైవర్ అక్కడకు చేరుకుని అసలు విషయం తెలుసుకున్నాడు. అక్కడికి ఓ మలేషియన్ విఐపి మినిస్టర్ వస్తున్నారని..ప్రత్యేకంగా సెక్యూరిటీ చూస్తున్నారని,ఆ మనుషులు స్పెషల్ పోలీసులని చెప్పాడు. అంతేగాక ఆమె ఇండియన్ ఆర్టిస్టు అని వారికి తెలియపరిచి వాతావరణాన్ని తేలిక పరిచారు. ఈ విషయాన్ని ఆమె అక్కడ మీడియాతో మాట్లాడింది. తానూ వారు...పొరపడటంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇలా జరిగిందని చెప్పింది. ఈ విషయంలో సారీలు తప్ప చేయగలిగిందేమీ లేదని చెప్పుకొచ్చింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











