హ్యాకర్ల బారిన జూ.ఎన్టీఆర్ హీరోయిన్
జూ.ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు చిత్రాలు చేసి,అతనిలో లవ్ ఎఫైర్ నడిపి పాపులర్ అయిన హీరోయిన్ సమీరా రెడ్డి. ఆమె బ్యాంక్ ఎక్కౌంట్ రీసెంట్ గా హాకర్ల దాడికి గురి అయ్యింది. ఆమె ఎక్కౌంట్ లోంచి నాలుగు లక్షలు రూపాయలు వాళ్లు డ్రా చేసుకున్నారు. అయితే అందులో సమీరా అభిమాని ఉన్నట్లున్నాడు. దాంతో అతను తన వాటాకు వచ్చిన డబ్బు లక్ష రూపాయలను ఆమెకు తిరిగి ఇచ్చేసి ఆమెతో స్నేహం ప్రారంబించాడు. అంతేగాక ఆమెకు బ్యాంక్ ఎక్కౌంట్స్ ఎలా మ్యానేజ్ చేసుకోవాలో,హ్యాకర్స్ బారిన పడకుండా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో సలహాలు ఇస్తున్నాడట. ఈ విషయాలని సమీరా మీడియాకు తెలిపింది.
తనుకు ఇప్పుడు ఆన్ లైన్ హ్యాకింగ్ మీద చాలా విషయాలు తెలిసాయని చెప్తోంది. అంటే ఆమె మూడు లక్షలు పే చేసి పాఠాలు నేర్చుకుంటోందన్నమాట అని ఇది విన్న బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆమె తన ట్విట్టర్ లో ఆ హ్యాకర్ కు ధ్యాంక్స్ కూడా చెప్పింది. భవిష్యత్ లో ఇక తాను ఆన్ లైన్ ట్రాన్సిక్షన్స్ చేయనని,క్రెడిట్ కార్డు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అని శెలవిచ్చింది.


Click it and Unblock the Notifications











