రవితేజ తెలుగులో దుమ్ము-తమిళంలో దమ్ము
రవితేజ త్వరలో టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి జంప్ కాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'శంభో శివ శంభో" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సముదిరకని డైరెక్షన్ లో ఈ తమిళ చిత్రముంటుంది. తమిళంలో సంచలన విజయం నమోదుచేసుకున్న 'సుబ్రహ్మణ్యపురం" చిత్రం తెలుగులో 'అనంతరపురం" గా అనువాదమైంది. కలర్స్ స్వాతి, జై, చిత్ర దర్శకుడు శశికుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో విలన్ గా నటించిన సముదిరకని ఈ తర్వాత 'నాడోడిగల్" అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నాడోడిగల్ చిత్రాన్ని తెలుగులో ఇదే దర్శకుడి నిర్దేశకత్వంలో 'శంభో శివ శంభో" పేరుతో రీమేక్ చేస్తున్నారు. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 75 శాతం పూర్తి చేసుకొన్నది. రవితేజ నటన దర్శకుణ్ణి ఆకట్టుకొన్నది దాంతో దర్శకుడు రవితేజను తమిళ చిత్రరంగానికి పరిచయం చేయాలనుకుంటున్నారని తెలిసింది. రవితేజ తనదైన ఎనర్జిటిక్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











