Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్టార్ హీరోల కన్నా అల్లరి నరేష్ ఆ విషయంలో గ్రేట్
తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకన్నా అల్లరి నరేష్ ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా రీసెంట్ మరో విజయాన్ని కూడా సాధించారు. మిగతా హీరోల సినిమాలు తమిళంలోకి అడపా దడపా డబ్బింగ్ అవుతూ అప్పుడప్పుడూ ఆడుతూంటే అల్లరి నరేష్ మాత్రం స్టైయిట్ గా తమిళంలో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. శశికుమార్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న 'పోరాళి" చిత్రంలో నరేష్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో 'నానోడిగల్"కు రీమేక్‌గా తెలుగులో రూపొందిన 'శంభో శివశంభో" చిత్రంలో నరేష్ ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించారు. అప్పుడు ఆ దర్శకుడుకి అల్లరి నరేష్ నటన, ఈజ్ బాగా నచ్చింది. దాంతో ఆయన తమిళంకు ఆహ్వానించారు. ఈ కొత్త చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక గతంలో విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన 'కురుంబు" చిత్రం ద్వారా అల్లరి నరేష్ తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ చిత్రం తెలుగులో చేసిన అల్లరి కి రీమేక్. ఇక అల్లరి నరేష్ రీసెంట్ రిలీజ్ కత్తి కాంతారావు చిత్రం ఘన విజయం సాధించకపోయినా కొన్నవారికి మాత్రం లాభాల్ని తెచ్చిపెట్టింది.