twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోల కన్నా అల్లరి నరేష్ ఆ విషయంలో గ్రేట్

    By Srikanya
    |

    తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకన్నా అల్లరి నరేష్ ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా రీసెంట్ మరో విజయాన్ని కూడా సాధించారు. మిగతా హీరోల సినిమాలు తమిళంలోకి అడపా దడపా డబ్బింగ్ అవుతూ అప్పుడప్పుడూ ఆడుతూంటే అల్లరి నరేష్ మాత్రం స్టైయిట్ గా తమిళంలో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. శశికుమార్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న 'పోరాళి" చిత్రంలో నరేష్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో 'నానోడిగల్"కు రీమేక్‌గా తెలుగులో రూపొందిన 'శంభో శివశంభో" చిత్రంలో నరేష్ ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించారు. అప్పుడు ఆ దర్శకుడుకి అల్లరి నరేష్ నటన, ఈజ్ బాగా నచ్చింది. దాంతో ఆయన తమిళంకు ఆహ్వానించారు. ఈ కొత్త చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక గతంలో విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన 'కురుంబు" చిత్రం ద్వారా అల్లరి నరేష్ తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ చిత్రం తెలుగులో చేసిన అల్లరి కి రీమేక్. ఇక అల్లరి నరేష్ రీసెంట్ రిలీజ్ కత్తి కాంతారావు చిత్రం ఘన విజయం సాధించకపోయినా కొన్నవారికి మాత్రం లాభాల్ని తెచ్చిపెట్టింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X