తమిళ సినిమాల్లో ఇతర భాషల నటులపై నిషేధం.. సముద్రఖని సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో దక్షిణాది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (FEFSI) వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. తమిళ సినిమాల్లో ఇతర భాషల నటులను, సాంకేతిక నిపుణులను తీసుకోవద్దని ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నది. అయితే ఫెప్సీ తీసుకొన్న నిర్ణయం కారణంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫెప్సీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? సముద్రఖని ఏ విధంగా స్పందించారనే విషయంలోకి వెళితే..
ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (The Film Employees Federation of South India (FEFSI)) తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలనే విషయంపై కఠి నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను సినీ పరిశ్రమ ముందు ఉంచింది. తమిళ సినిమాల్లో తమిళ నటులే ఉండాలని సూచించింది. అలాగే తమిళనాడులోని సినిమాను పూర్తిగా చిత్రీకరించేందుకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది.

అయితే తమ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన దర్శక, నిర్మాతలపై కఠినంగా చర్యలు తీసుకొంటామని ఫెఫ్సీ ఆదేశవాలు జారీ చేసింది. తాము రూపొందించిన నియమ నిబంధనలను పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించింది.
తమిళ సినిమాల్లో తమిళులకే 100 శాతం అవకాశాలు కల్పించాలని చేసిన మార్గదర్శకాలపై నటుడు, దర్శకుడు సముద్రఖని ఘాటుగా స్పందించారు. అయితే ఫెఫ్సీ విడుదల చేసిన మార్గదర్శకాలు తెలియవు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్రో సినిమా బిజీలో ఉన్నాను. కాబట్టి ఆ విషయం నా వద్దకు రాలేదు అని చెప్పారు.

ఫెఫ్సీ నిర్ణయంపై సముద్రఖని స్పందిస్తూ.. ఆ నిర్ణయం సరికాదు. భాషకు, ఆర్ట్‌కు సరిహద్దులు లేవు. ఒకవేళ ఫాఫ్సీ ఈ నిర్ణయం తీసుకొంటే చాలా తప్పుడు నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే ఒక భాషలోని నటులు, మరో భాషలో నటిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయం సరికాదన్నది నా అభిప్రాయం అని అన్నారు.
పాన్ ఇండియా సినిమాలు వస్తున్న సమయంలో తెలుగు దర్శకుడు తమిళంలో సూపర్ స్టార్‌తో సినిమా చేశాడు. కన్నడ డైరెక్టర్ వచ్చి తెలుగులో సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, కళా రంగం భాష, ప్రాంతీయ హద్దుల్ని చెరిపేస్తున్నది. ఫెఫ్సీ అలాంటి నిర్ణయం తీసుకొంటే ఇండియన్ సినిమాకు అది మేలు కలిగించదు అని సముద్రఖని అన్నారు.


Click it and Unblock the Notifications











