Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలాంటి దుస్తులు వేసుకున్నందుకు.. పచ్చిపచ్చిగా మాట్లాడి దాడి చేసింది.. హీరోయిన్ వీడియో వైరల్
ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ మాఫియా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే సంజనా గల్రానీ విషయం మీడియాలో రచ్చకెక్కింది. ఇక మరో హీరోయిన్ పేరును డ్రగ్స్ రాకెట్ పేరులో తీసుకురావాలని ప్రయత్నించారట. కిరాక్ పార్టీ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కొందరు దాడి చేసి, డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారట. ఈ మేరకు సంయుక్త ఓ వీడియోను షేర్ చేస్తూ సాయాన్ని అర్థించింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
Recommended Video
పార్కులో వర్కౌట్లు..
సంయుక్త హెగ్డే పార్కులో తన స్నేహితులతో కలిసి వర్కౌట్లు చేస్తోందట. స్పోర్ట్ డ్రెస్సులు ధరించి ఉండటం, రింగులో వర్కౌట్లు చేస్తూ ఉండగా ఓ మహిళ, ఇంకా కొందరు వచ్చి సంయుక్త స్నేహితురాలిపై దాడిచేశారు. వీటికి సంబంధించిన వీడియోలుకూడా వైరల్ అవుతున్నాయి. సంయుక్త హెగ్డే ఈ తతంగాన్ని మొత్తం లైవ్ వీడియోను షేర్ చేసింది.
దారుణంగా తిట్టారు..
స్పోర్ట్స్ డ్రెస్, బ్రా వేసుకుని ఉన్నందుకు ఆ మహిళ వచ్చి దూర్భాషలాడింది. క్యాబర్ డ్యాన్స్ చేస్తున్నారు.. అంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడింది. మా ఫ్రెండ్‌పై దాడి చేసింది. పైగా మమ్మల్ని డగ్ర్ కేసులో అరెస్ట్ చేయిస్తామని బెదిరించారు అంటూ లైవ్‌లో చెప్పుకుంటూ వాపోయింది.
సోషల్ మీడియాలో ఫిర్యాదు..
మనం ఈ రోజు ఏం చేస్తామో అదే మన రేపటి భవిష్యత్తు. ఆగ్రా లేక్ వద్ద కవితా రెడ్డి మమ్మల్ని దూషించింది. దాడి చేసింది. మా దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. సిటీ కమిషనర్ దీనిపై స్పందించాలి ఇది చాలా తప్పు అంటూ సంయుక్త ఓ వీడియోను షేర్ చేసింది.
కొంతమంది మద్దతు..
ఆ పార్క్‌లో ఉన్న వారు, ముందు నుంచీ ఈ గొడవను గమనిస్తున్న వారు సంయుక్తకు మద్దతు తెలిపారు. వారు తమ వర్కౌట్లు చేసుకుంటూ ఉంటే ఆ లేడీ వచ్చి దాడి చేసిందని చెప్పుకొచ్చార. అక్కడ జరిగిన ప్రతీ విషయాన్ని రికార్డ్ చేసింది. ఏ డ్రెస్‌లో వర్కౌట్లు చేసిందో కూడా అక్కడే టీ షర్ట్ విప్పి చూపించింది. ఇలా బ్రాలో ఉన్నందుకు తమను విపరీతంగా దూషించిందని సంయుక్త చెప్పుకొచ్చింది.