twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవకాశాల కోసం అలా సర్దుకుపోవాల్సిందేనా? ...హీరోయిన్ సూటి ప్రశ్న

    By Srikanya
    |

    చెన్నై : కళ్యాణ్ రామ్ తో కత్తి,మంచు మనోజ్ తో మిస్టర్ నోకియా సినిమాల్లో చేసిన సనాఖాన్ తాజాగా సిల్క్ స్మితగా వెండితెరను పలకరిస్తోంది. సిల్క్‌స్మిత పాత్రలో మలయాళంలో తెరకెక్కుతున్న 'క్లెమాక్స్‌'లో నటిస్తోంది. ఇది తమిళంలో 'నడిగైయిన్‌ డైరీ'గా అనువాదమవుతోంది. ప్రచారచిత్రం, ఆడియో విడుదల ఇటీవల చెన్నైలో జరిగాయి.

    ఈ సందర్భంగా షనాఖాన్‌ మాట్లాడుతూ... 'ఒక నటికి ఎంత ప్రతిభ ఉన్నా. అవకాశాల కోసం సర్దుకుపోవాల్సిందేనా?' అనే సంభాషణ ఈ 'క్లెమాక్స్‌' చిత్రంలో ఉంది. దాన్ని చెప్పేటప్పుడు చాలా బాధపడ్డా. అలాంటి పరిస్థితి ఉండటం వాస్తవమే. అది వారివారి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నాకు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది.

    ఇక సిల్క్‌స్మిత పాత్రలో నటించమని పిలిచినప్పుడు చాలా సంతోషంతో ఒప్పుకున్నా. ఆమె అలంకరణ, ఆహార్యం, నడక, హావభావాలు వంటి అంశాలను నిశితంగా గమనించాను. ఆమెలా నటించడం చాలా కష్టమే. సిల్క్‌స్మిత ఆత్మహత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆమె మృతి తీరని లోటని ఇప్పుడే అర్థమవుతోంది అన్నదామె.

    తమిళంలో 'శిలంబాట్టం' ద్వారా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సనాఖాన్‌. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినా ఇక్కడ రాణించలేకపోయింది. తాజాగా ఈ చిత్రంతో తానేంటో ప్రూవ్ చేస్తానంటోంది. తన లోని టాలెంట్ ని ఈ సినిమా వెలికితీస్తోందని, విద్యాబాలన్ కి డర్టి పిక్చర్ బ్రేక్ ఇచ్చినట్లు తనకు ఈ చిత్రం తిరిగి నిలదొక్కుకునేలా చేస్తుందని భావిస్తోంది.

    సనాఖాన్ ప్రధానపాత్రలో సిల్క్ గా నటించటానికి రెడీ అవుతన్న ఈ చిత్రానికి.... సిల్మ్ స్మితకు మళయాళంలో బ్రేక్ ఇచ్చిన ఆంధోని ఈస్ట్ మ్యాన్ స్క్రిప్టు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 'ది డర్టీ పిక్చర్'కి అస్సలు సంభందం లేదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. 'ది డర్టీ పిక్చర్'అనేది ఫిక్షన్ స్టోరీ అని,తాము చేస్తున్నదే ఒరిజనల్ సిల్మ్ స్మిత జీవిత చరిత్ర అని చెప్తున్నారు. మరో ప్రక్క ఇక ఇప్పటికే 'ది డర్టీ పిక్చర్' బెంగాళి వెర్షన్ రెడీ అవుతోంది. రాఖీ సావంత్ ఈ బెంగాళి వెర్షన్ లో నటిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శతాబ్ది రాయ్ దర్శకత్వం వహిస్తోంది. శతాబ్ది రాయ్ ..నటి నుంచి పొలిటీషన్ గా ఎదిగి పార్లమెంట్ కి వెళ్లుతున్న దర్శకురాలు.

    English summary
    Sana Khan will be doing the role of actress Silk Smitha in the forthcoming Malayalam movie titled ‘Climax’. The movie will be dubbed in Tamil as ‘Nadigaiyin Diary’ and also dubbed in Telugu. The movie is not the remake of Vidya Balan’s Dirty Picture. Antony Eastman who introduced Silk Smitha in the Malayalam movies made the script for the film. Sana Khan is well known for her sexy roles in the Telugu and Tamil movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X