For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సందీప్ కిష‌న్‌కు బంపర్‌హిట్.. తమిళంలో మరో మాయ..

By Rajababu
|

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు 2017 కొంచెం తీపి, చేదు ని క‌లిగించింద‌నే చెప్పాలి. ఈ ఏడాది ఆయన నటించిన 'నగరం'.. 'శమంతకమణి'.. 'C/o సూర్య' చిత్రాలకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే లభించాయి. న‌ట‌న‌ విషయంలో సందీప్‌లో కొంత పరిణతితో కూడిన ప్రతిభ కనిపించింది. అలాగే న‌క్ష‌త్రం లో న‌టుడుగా త‌న క‌ష్టం క‌నిపించినా చిత్రం ఆక‌ట్టుకొలేదు. కాగా తమిళంలో సందీప్‌కు మంచి ఫలితాలు వస్తున్నాయి.

మాయవన్‌కు ఫుల్ రెస్పాన్స్

మాయవన్‌కు ఫుల్ రెస్పాన్స్

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘నగరం' తమిళంలో సూపర్ హిట్టయింది. ‘C/o సూర్య' తమిళ వెర్షన్ నుంచి మంచి ప్ర‌శంసలు వ‌చ్చాయి. ఈ లోపు సందీప్ కిష‌న్ నటించిన మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే.. మాయావన్. మాయావన్ తెలుగు వెర్ష‌న్ లో ప్రాజెక్ట్ జెడ్ పేరుతో విడుద‌ల‌కి సిధ్ధంగా వుంది.

సైన్స్ ఫిక్షన్ సినిమాగా

సైన్స్ ఫిక్షన్ సినిమాగా

మాయవన్ చిత్రం సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందింది. నలన్ కుమారస్వామి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. వరుస హత్యల కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో సస్సెన్స్ మిస్టరీ అంశాలు అలరించాయి.

హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి

హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి

విభిన్నమైన సినిమాలతో నిర్మాతగా గొప్ప పేరు సంపాదించిన సి.వి.కుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం మాయావ‌న్‌. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఈ వార‌మే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మాయవన్‌ సూపర్ టాక్

మాయవన్‌ సూపర్ టాక్

మయావన్ చిత్రానికి ముందుగానే ప్రివ్యూలు వేయగా.. మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. రివ్యూలు బాగున్నాయి. ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనం.... సందీప్ కిషన్ పెర్ఫామెన్స్ సూపర్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రం తెలుగులోకి ‘ప్రాజెక్ట్ జెడ్' పేరుతో త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

సందీప్‌కు తమిళంలో మరో హిట్

సందీప్‌కు తమిళంలో మరో హిట్

త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్ ని సొంతం చేసుకుంటున్నారు కాని తెలుగు హీరోలు చాలా త‌క్కువ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే చెప్పాలి.. కాని సందీప్ కిష‌న్ మాత్రం త‌మిళ మార్కెట్ లో వ‌రుస విజ‌యాల‌తో ఓ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. మెత్తానికి మాయావన్ తో సందీప్ కిష‌న్ త‌మిళ మార్కెట్ లో మ‌రో హిట్ని సొంతం చేసుకున్నాడు.

English summary
Director CV Kumar's latest movie is Maayavan, which has Sundeep Kishan, Lavanya Tripathi, Daniel Balaji, Jackie Shroff and others in the cast. The film has Gopi Amarnath's cinematography and Leo John Paul's editing. Ghibran has composed the music for the Tamil flick and a few tracks that include Mella Mella have impressed the viewers.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more