రెండో తరగతిలోనే ప్రేమలో పడానంటున్న హీరోయిన్
నా ఫస్ట్ క్రష్ రెండో తరగతి చదివేటప్పుడు..నా క్లాస్ మీట్ తో జరిగిందది. అతనో మంచి సింగర్. అంటోది ప్రేమిస్తే..ఫేమ్ సంధ్య. ప్రేమ విషయమై ఆమె మాట్లాడుతూ...నాకు అదేంటో గానీ గాయకుడు అని తెలిస్తే చాలు మనస్సు అటు వైపు మళ్ళిపోతుంది. మీరు నమ్మరు గానీ స్టార్ సింగర్స్ అందరితో నేను పరిశ్రమకు రాకముందు నుంచీ ప్రేమలో ఉన్నాను. ఫీల్డులో ప్రవేశించాక వారి పరిచయంతో నాకు భలే హ్యాపీగా ఉంటుంది. అయినా నన్ను ఇంప్రెస్ చేయాలంటే పాడటం ఒకటే వస్తే చాలదండోయ్.ప్రసుతం కమలాకర్ రెడ్డి నిర్మిస్తున్న హాసిని చిత్రంలో నటిస్తున్న ఆమె తన మనస్సులో మాటను ఇట్లా చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ అనేది గ్రేట్ ఫీలింగ్..అలాగే ప్రేమ అనేది దానంతట అదే కలగాలి.అంతే తప్ప బలవంతంగానో, ఫోర్స్ తోనో కలగదు..అంటూ చెప్పుకొచ్చిది. ఇంతకీ ఇవన్నీ అనుభవంతో చెప్తున్న మాటలా అంటే మూతి మూడు వంకరలు తిప్పి తప్పుకుంది.
More from Filmibeat
సంధ్య అన్నవరం భరత్ పవన్ కళ్యాణ్ ప్రేమిస్తే రెండవ తరగతి హాసిని కమలాకర్ రెడ్డి premisthe sandya annavaram bharath pawan kalyan hasini


Click it and Unblock the Notifications











