బెదిరిస్తున్నారంటూ హీరోయిన్ సంగీత
అప్పట్లో ఒక వెలుగు వెలిగిన సంగీత ఆ మధ్యన సింగర్ క్రిష్ ని వివాహం చేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే. అయితే జనవరి ఒకటవ తేదీన వారు స్విజ్జరలాండ్ తమిళులు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ కు హాజరవటానికి ఓకే చేసారు. అయితే శ్రీలంక తమిళులు ఈ ఈవెంట్ తమకు వ్యతిరేకంగా శ్రీలంకకు గరవర్నమెంట్ కు చెందిన కరణ అనే వ్యక్తి ఏర్పాటు చేసాడని దానికి వెళ్లటమేంటిని నిలదీస్తున్నారు. అంతేగాక సంగీతకు,క్రిష్ కు బెదిరిస్తూ ఫోన్ కాల్స్ , ఈ మెయిల్స్ పంపుతున్నారు. ఈ విషయమై మొగడు, పెళ్లాలిద్దరూ ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ నిర్వహించి క్లారిఫికేషన్ ఇచ్చారు.
అందులో తమకు ఈ రాజకీయాలేమీ తెలియవని, కేవలం రంగన్ అనే స్నేహితుడు ఏర్పాటు చేస్తున్న ఈవెంట్ కావటంతో తాము వెళ్లటానికి ఒప్పుకున్నామన్నారు. ఇందులో తాము ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఆలోచన లేదని అన్నారు. తమకు ఇందులో శ్రీలంక గవర్నమెంట్ కి చెందిన వారి ఇన్వాల్వమెంట్ ఉందని అనుకోవటం లేదని,అలాంటిది ఉంటే తామే కాదనే వాళ్లమని అన్నారు. ఈ విషయమై తాము చాలా మనస్ధాపం చెందామని,తాము కేవలం కళాకారులమేనని,తమను అలాగే చూడాలని కోరారు. ఇక రంగం ఫేమ్ జీవా కూడా మొదట ఈ ఈవెంట్ కు రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ తర్వాత నో చెప్పేసి తప్పుకున్నాడు. సంగీత తెలుగులో అలీ ప్రక్కన ఆశల సందడి సినిమాతో పరిచయమైనా ఖడ్గం చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరవాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు.


Click it and Unblock the Notifications











