నయనతార, హన్సిక బ్రేకప్ వెనుక అసలు విషయాలు.. తాజా టీవీ ఇంటర్వ్యూలో గుట్టువిప్పిన శింబు
కోలీవుడ్ హీరో శింబు అకా సిలంబరాసన్ జీవితంలో ఎన్నో అఫైర్లు, బ్రేకప్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే అవేవీ పెళ్లి పీటల వరకు రాలేకపోయాయి. అందుకు గల కారణాలను శింబు ఇటీవల తమిళ ఛానెల్స్‌తో పంచుకొన్నారు. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్స్ నయనతార, హన్సిక మోత్వాని తదితర హీరోయిన్లతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన విషయం సినీ అభిమానులకు తెలియనిదేమీ కాదు. ఈ క్రమంలో వారితో బ్రేకప్ వెనుక కారణాలు వెల్లడించిన విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.. ఆదివారం టెలికాస్ట్ కానున్న ఇంటర్య్వూలో ముఖ్యాంశాలు ఇవే..
Recommended Video

తమిళంలో పాపులర్ షోకు శింబు
తమిళ టెలివిజన్ సంగీతా క్రిష్ నిర్వహించే నచతిరా జన్నల్ అనే షో తమిళ బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ ఉన్న కార్యక్రమం. ఈ షోకు మంచి ఆదరణ ఉంది. లాక్‌డౌన్ పిరియడ్‌లో శింబుతో ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ చేసింది. అయితే ఒక ఫ్లో తన ప్రేమ వ్యవహారాలను పూసగుచ్చినట్టు వెల్లడించిన శింబు ఆ తర్వాత ఆ పోర్షన్‌ను తొలగించాలని కోరడం చర్చనీయాంశమైంది.

ప్రేమ వైఫల్యాల వెనుక కారణాలు
ప్రేమ వ్యవహారాల్లో తనకు సరైన అవగాహన లేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే తన అఫైర్లు బ్రేకప్ అయ్యాయని శింబు పేర్కొన్నారు. ముఖ్యంగా నయనతార, హన్సిక మోత్వాని ప్రేమ విషయంలో తాను అనేక పొరపాట్లు చేశానని, అందుకే వారితో ముందుకు కొనసాగలేకపోయాను అని చెప్పినట్టు సమాచారం.

నా బ్రేకప్ విషయాలను ప్రసారం చేయొద్దు
హోస్ట్ సంగీతా క్రిష్‌తో ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత నయనతార, హన్సిక గురించి మాట్లాడిన విషయాలు అప్రస్తుతమని శింబు భావించారట. దాంతో వారికి ఫోన్ చేసి ఇప్పుడు నయనతార, హన్సిక గురించి మాట్లాడటం భావ్యం కాదు. అందుకే ఆ విషయాలను ఇంటర్వ్యూ నుంచి తొలగించమని కోరినట్టు తెలిసింది. మళ్లీ విషయాలు మాట్లాడటం వల్ల వారు బాధపడే అవకాశం ఉంది. మానిపోయిన గాయాలను మళ్లీ కెలకడం ఎందుకని ఆయన అన్నట్టు తెలిసింది.

అధ్యాత్మిక చింతన వల్లే
శింబు తన ఇంటర్వ్యూలో ఎక్కువగా మతం, అధ్యాత్మిక విషయాలను ఎలా అలవాటు చేసుకొన్నాననే విషయంపై ఎక్కువగా మాట్లాడరట. అధ్యాత్మిక చింతనకు దగ్గర కావడం వల్లే తాను ఇప్పుడు పరిణితితో వ్యవహరిస్తున్నానని, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొంటున్నట్టు శింబు ఇంటర్వ్యూలో వెల్లడించినట్టు సమాచారం. అయితే ఈ విషయాలన్నీఇంటర్వ్యూలో ఉంటాయా? అనేది ఆదివారం ఇంటర్వ్యూలో ప్రసారమైతే తప్ప అసలు విషయం బయటకు రాదు.


Click it and Unblock the Notifications











