త్రిషతో నాకు తగువు పెట్టాలని చూసారు

By Srikanya

త్రిషకు తనకు మధ్య గొడవలు పెట్టాలని మన్మధన్‌ అంబు చిత్రయూనిట్‌ ప్రయత్నించిందని నటి సంగీత వెల్లడించారు.ఆమె కమల్ హాసన్ తాజా చిత్రం మన్మధన్ అంబులో ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఈ చిత్రం షూటింగ్ సమయంలో తనూ,త్రిష చాలా స్నేహంగా మెలగేవారమని అయితే కొందరు అది చూసి ఓర్వలేని వారు గిల్లి కజ్జాలు పెట్టి ఆనందించాలనుకున్నారని అంది.తాను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. మేకప్‌ టిప్స్‌, కాస్ట్యూమ్స్‌ వంటి విషయాల్లో తామిద్దరం ఒకరికొకరు సహకరించుకునేవాళ్లమని తెలిపారు. ఇద్దరి మధ్య చక్కని సాన్నిహిత్యం ఏర్పడిందని వివరించారు.

ఇక వివాహం అయి సెకెండ్ ఇన్నింగ్స్ లో పెద్ద స్టార్ చిత్రంలో అవకాశం రావటం తన అదృష్టం అంటోంది. కమల్ ‌హాసన్‌, మాధవన్‌, త్రిష మొదలగు వారితో కలిసి మన్మధన్‌ అంబు చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు కెఎస్ రవి కుమార్‌ దర్శకత్వంలో రెడ్‌ జెయింట్‌ పతాకంపై ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ యూరప్‌ దేశాలలో జరుగుతోంది. ఈ సందర్భంగా నటి సంగీత ఈ చిత్రంలో నటించిన అనుభవాలను వెల్లడించింది. కమల్‌ హాసన్‌, కెఎస్ రవి కుమార్ ‌లతో పని చేయడం తీయని జ్ఞాపకంగా మిగిలిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాధవన్‌, త్రిషలతో కలిసి షూటింగ్‌ లో చాలా ఎంజాయ్‌ చేశానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X