రెగ్యులర్ గా సినిమాల్లో ప్రేమ పెళ్ళిళ్ళలకు పెద్దల అడ్డంకులు చెపుతూంటారు. అయితే ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ సంగీత జీవితంలోనూ అదే జరుగుతోంది. ఆమె గాయకుడు క్రిష్ ని పెళ్ళి చేసుకుంటానని ప్రకటించగానే..అతని ఇంట్లో వాళ్ళు మా కిష్టం లేదని తేల్చి పారేసారు. క్రిష్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ..పెళ్ళికి తామేమి ఎరేంజ్ మెంట్స్ చేయటం లేదని..పెళ్ళి తామేమీ ఎప్రూవ్ చేయలేదంటున్నారు. అయితే క్రిష్ మాత్రం వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టి సంగీతని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడని తెలుస్తోంది. ఆమె మాత్రం అలా కాదు పెద్దల అనుమతితోనే చేసుకుందాం...అవసరమైతే కొంత కాలం ఆగుదామంటుందని సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే పెళ్ళి ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. తిరువనంతపురం లో పిబ్రవరి ఒకటవ తేదిన పెళ్ళి..చెన్నైలో ఆ తర్వాత రోజు రిసెప్షన్ జరుగుతుంది.