మరో తెలుగు హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్
ఇప్పుడు పెళ్లిళ్లు సీజన్ నడుస్తున్నటుంది. హీరోలు, హీరోయిన్స్ వరసగా పెళ్లిళ్లుకు రెడీ అవుతున్నారు.ఇప్పుడు అదే వరసలో మాజీ తెలుగు హీరోయిన్ సంఘవి చేరింది. రామానాయుడు బ్యానర్ లో తాజమహల్ చిత్రంతో పరిచయమైన ఆమె తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 95 చిత్రాలు దాకా చేసింది. ఆమె వివాహం అమెరికాలో డాక్టర్ గా చేస్తున్న వ్యక్తితో జరగనుంది. మార్చి 5,2012న ఈ వివాహం జరగనుంది. వివాహం చెన్నైలోనే జరగనుంది. అయితే వెన్యూ వివరాలు తెలయరాలేదు.
వివాహానంతరం తన సినీ జీవితానికి స్వస్తి చెప్పి అమెరికాలో సెటిల్ కానుంది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితం శుభ ప్రధంగా జరుగుతుందని భావిస్తున్నానని, తనను అర్దం చేసుకునే వ్యక్తి భర్తగా దొరకటం అదృష్టమంటోంది. ఇక జెనీలియా కూడా పిబ్రవరి నెలలో పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఆ మధ్య మీనా కూడా వివాహం చేసుకుని ఓ ఇంటిదయ్యిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











