twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిమ్రాన్ కన్నా సంఘవికే...

    By Staff
    |

    Sanghavi
    తమిళ,తెలుగు పరిశ్రమలో మాజీ నటీమణులైన సిమ్రాన్,సంఘవిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కారణం ప్రొఫిషనల్ జెలసీ అని సమాచారం. అయితే ఇద్దరూ ఫేడవుట్ అయ్యారు కదా ఇంకా జెలసీ ఏమిటి అంటే..అదంతే అంటున్నారు. ఖాళీగా ఉంటున్నాం కదా అని ఇద్దరూ తలో టీవీ సీరియల్ లో నటించిపారేసారు. అందులో అంతా సిమ్రాన్ నటించిన మరుపురాని కథలు టాప్ స్లాట్ లో ఉంటాయనుకున్నారు.

    అయితే అనుకోని ట్విస్టు పడింది. మరుపురాని కధలు కన్నా సంఘవి నటించిన గోకులంలో సీత కు పుల్ రేటింగ్స్ ఉన్నాయి. దీంతో అందరూ సంఘవి సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అంతేగాక టీవీ నిర్మాతలంతా ఆమెకోసం క్యూలు కడుతున్నారు. మరో ప్రక్క సిమ్రాన్ నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ డిజాస్టర్ టాక్ తో ధియోటర్స్ నుండి వెళ్ళిపోయింది.

    అటు సినిమా..ఇటు టీవి రెండు మోసం చేస్తే ఎలా..అయినా నేను వచ్చాననే కదా సంఘవి కూడా సీరియల్స్ లోకి వచ్చిందని మండిపడుతోంది సిమ్రాన్. ఇంతకుముందు కూడా చాలా మంది మాజీ హీరోయిన్స్ తన భారీ ఆకారాలతో టీవీ తెరను దడిపెట్టించిన వారే. నువ్వే మొదటి దానివనుకోకు అంటున్నారు అంతా...అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X