twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటల్‌లో కె.విశ్వనాధ్ 'శంకరాభరణం'

    By Srikanya
    |

    Sankarabharanam Movie Digitisation
    చెన్నై : అలనాటి సినీ ఆణిముత్యం.. 'శంకరాభరణం' త్వరలో డిజిటెల్ వెర్షన్ లో తమిళ ప్రేక్షకులను అలరించనుంది.. 35 ఎంఎం నుంచి సినిమాస్కోప్‌కు మారిన ఈ సినిమా.. ఎప్పటికప్పుడు సాంకేతికంగా కొత్త సొబగులు అద్దుకుని.. ఆయాతరాల ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ప్రస్తుతం డీటీఎస్‌ శబ్ధంతో డిజిటలైజేషన్‌గా మారుతోంది. నేటి తర ప్రేక్షకులను అరలించేందుకు సంసిద్ధమవుతోంది. శ్రీశబరిగిరి వాసన్‌ మూవీస్‌ బ్యానరుపై పీఎస్‌ హరిహరన్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    ఈ అద్భుత సంగీ త భరిత తెలుగు చిత్రం భారతదేశం అంతటా విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి ప్రపంచఖ్యాతి సాధిం చిన శంకరాభరణం తొలిసారిగా ఇన్నేళ్ల తరువాత తమిళంలోకి అనువాదం కావడంతో పాటు సినిమా స్కోప్, డీటీహెచ్, డిజిటల్ వంటి ఆధునిక హంగులతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

    ఆధ్యాత్మిక సంగీత, సాహిత్యపు విలువలతో కూడిన శంకరాభరణం చిత్రంలో దివంగత ప్రఖ్యాత సంగీత దర్శకులు కేవీ మహదేవన్ సంగీత బాణీలు కట్టిన ప్రతి పాటా ఆణిముత్యమే, సజీవమే. జేవీ సోమయాజులు, చంద్రమోహన్, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, తులసి, అల్లురామలింగయ్య తదితరులు ముఖ్య ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ శబరిగిరివాసన్ మూవీస్ అధినేత పీఎస్ హరిహరన్ తమిళంలోకి అనువదిస్తున్నారు. తమిళ సంభాషణలను ఆర్ ఎస్ రామకృష్ణన్ అందించిన ఈ చిత్రానికి తమిళ ముదన్ తాయన్‌లుగా సాహిత్యాన్ని అందించారు.

    భారతీయ సినిమా శతాబ్ద వేడకులను జరుపుకున్న సందర్భంగా శంకరాభరణం వంటి గొప్ప కళాఖండం మళ్లీ సరికొత్త హంగులతో త్వరలో తెరపైకి రానుండడం ఆహ్వానించదగ్గ విషయం. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేవీ మహదేవన్‌ సంగీతం సమకూర్చారు. బాలుమహేంద్ర కెమెరామెన్‌గా పనిచేశారు. సోమయాజులు, మంజుభార్గవి, రాజలక్ష్మి, తులసి, చంద్రమోహన్‌, అల్లురామలింగయ్య తదితరులు నటించిన విషయం తెలిసిందే. తమిళంలో ఆర్‌ఎస్‌ రామకృష్ణన్‌ మాటలు రాశారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమా రావడంపై సినీవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

    English summary
    Śankarabharanam is a 1979 blockbuster, Telugu film, directed by K. Viswanath and produced by Poornodaya Movie Creations. The soundtrack, composed by KV Mahadevan, led to an increase in usage of Indian classical music in Indian cinema. The film is listed among CNN-IBN's list of hundred greatest Indian films of all time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X