twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను హీరో అని పిలవొద్దని చెప్పా

    By Srikanya
    |

    చెన్నై: ప్రస్తుతం పరిశ్రమలోని స్నేహితులందరూ హీరో అనే పిలుస్తున్నారు... హాస్యంగా! ఈ సినిమా చేస్తున్నాననే విషయం తెలియగానే మిత్రుడు ఆర్య ఫోన్‌ చేశారు. 'మా అందరికీ ఫ్రెండ్‌గా నటించావు. మరి నీకు మిత్రుడిగా ఎవరు నటిస్తున్నారు?' అని అడిగారు. 'హాలీవుడ్‌ చిత్రాల్లో ఆర్నాల్డ్‌ కూడా ఫ్రెండ్‌ లేకుండా నటించాడు. ఆయనలా నేనూ దుమ్ము దులుపుతా'నని సమాధానమిచ్చా అన్నారు ప్రముఖ హాస్య నటుడు సంతానం. ఇన్నాళ్లూ హీరోకు సైడ్ కిక్ గా ఉన్న సంతానం గా మారారు. వందకుపైగా చిత్రాల్లో నటించారనే మైలురాయిని తాకిన సంతానం.. 'వళ్లవనుక్కు పుల్లుం ఆయుధం'లో హీరోగా నటిస్తున్నారు. తెలుగులో సునీల్‌ హీరోగా నటించిన 'మర్యాద రామన్న'కు రీమేక్‌ ఇది. శ్రీనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

    Santhanam about 'Maryada Ramanna' remake

    అలాగే... 'ఏంటి హీరో. ఏం చేస్తున్నావు..' అని ఓ సారి శింబు ఫోన్‌ చేశారు. అలా పిలవొద్దనగానే ఏమైందని అడిగారు. నేను హీరో కాకముందే వీటీవీ గణేష్‌ కథానాయకుడు అయ్యారు.... అందువల్లే నాకు అసహ్యమేస్తోందని చెప్పా. వెంటనే పక్కనే ఉన్న గణేష్‌ నన్ను చూసి.. 'ఏంట్రా శింబు ఫోన్‌ చేస్తే మీ గురించి మాట్లాడుకోండి.. మధ్యలో నన్నెందుకు జోకర్‌ని చేస్తున్నావ'ని అడిగారు. ఆ తర్వాత రోజు జీవా ఫోన్‌ చేశారు. 'బామ్మర్ది.. మార్కెట్‌లో చాలా కొత్తరకాల విగ్గులు వచ్చాయి.. నీకు నచ్చింది తీసుకో' అని చెప్పారు.

    ఇక హీరో కావాలనే ఉద్దేశం లేదు. కానీ ఈ కథ కోసమే నేను హీరోనవుతున్నా. ఈ సినిమాలోనే కామెడీ హీరోగా నటించగలను. రెండు భిన్నమైన హావభావాలను వ్యక్తపరిచే పాత్ర నాది. బహుశా.. ఇతర స్క్రిప్టుల్లో ఇలా నటించలేను. అందుకే ఎంచుకున్నా. నేను ఎలా నటించినా, ఏం చేసినా థియేటర్‌లో ప్రేక్షకులు చప్పట్లు కొడతారని అనుకోవడం లేదు. ప్రతిదీ వైవిధ్యంగా ఉంటుంది. సినిమాలో నృత్యం, ఛేజింగ్‌, రన్నింగ్‌.. ఇలా చాలా ఉంటాయి అంటూ ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం చెప్పుకొచ్చారు.

    English summary
    S.S.Rajamouli and Sunil's super hit film,'Maryada Ramanna', is going to be remade in Tamil and famous comedian Santhanam will reprise Sunil in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X