Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నన్ను హీరో అని పిలవొద్దని చెప్పా
చెన్నై: ప్రస్తుతం పరిశ్రమలోని స్నేహితులందరూ హీరో అనే పిలుస్తున్నారు... హాస్యంగా! ఈ సినిమా చేస్తున్నాననే విషయం తెలియగానే మిత్రుడు ఆర్య ఫోన్ చేశారు. 'మా అందరికీ ఫ్రెండ్‌గా నటించావు. మరి నీకు మిత్రుడిగా ఎవరు నటిస్తున్నారు?' అని అడిగారు. 'హాలీవుడ్ చిత్రాల్లో ఆర్నాల్డ్ కూడా ఫ్రెండ్ లేకుండా నటించాడు. ఆయనలా నేనూ దుమ్ము దులుపుతా'నని సమాధానమిచ్చా అన్నారు ప్రముఖ హాస్య నటుడు సంతానం. ఇన్నాళ్లూ హీరోకు సైడ్ కిక్ గా ఉన్న సంతానం గా మారారు. వందకుపైగా చిత్రాల్లో నటించారనే మైలురాయిని తాకిన సంతానం.. 'వళ్లవనుక్కు పుల్లుం ఆయుధం'లో హీరోగా నటిస్తున్నారు. తెలుగులో సునీల్ హీరోగా నటించిన 'మర్యాద రామన్న'కు రీమేక్ ఇది. శ్రీనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే... 'ఏంటి హీరో. ఏం చేస్తున్నావు..' అని ఓ సారి శింబు ఫోన్ చేశారు. అలా పిలవొద్దనగానే ఏమైందని అడిగారు. నేను హీరో కాకముందే వీటీవీ గణేష్ కథానాయకుడు అయ్యారు.... అందువల్లే నాకు అసహ్యమేస్తోందని చెప్పా. వెంటనే పక్కనే ఉన్న గణేష్ నన్ను చూసి.. 'ఏంట్రా శింబు ఫోన్ చేస్తే మీ గురించి మాట్లాడుకోండి.. మధ్యలో నన్నెందుకు జోకర్ని చేస్తున్నావ'ని అడిగారు. ఆ తర్వాత రోజు జీవా ఫోన్ చేశారు. 'బామ్మర్ది.. మార్కెట్లో చాలా కొత్తరకాల విగ్గులు వచ్చాయి.. నీకు నచ్చింది తీసుకో' అని చెప్పారు.
ఇక హీరో కావాలనే ఉద్దేశం లేదు. కానీ ఈ కథ కోసమే నేను హీరోనవుతున్నా. ఈ సినిమాలోనే కామెడీ హీరోగా నటించగలను. రెండు భిన్నమైన హావభావాలను వ్యక్తపరిచే పాత్ర నాది. బహుశా.. ఇతర స్క్రిప్టుల్లో ఇలా నటించలేను. అందుకే ఎంచుకున్నా. నేను ఎలా నటించినా, ఏం చేసినా థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడతారని అనుకోవడం లేదు. ప్రతిదీ వైవిధ్యంగా ఉంటుంది. సినిమాలో నృత్యం, ఛేజింగ్, రన్నింగ్.. ఇలా చాలా ఉంటాయి అంటూ ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం చెప్పుకొచ్చారు.