జై భీమ్ వివాదం మీద సంతానం సంచలనం.. కించపరచకూడడు అంటూ కామెంట్స్.. ఫైర్ అవుతున్న సూర్య ఫ్యాన్స్?

సినిమాల్లో చిన్న విషయాన్ని పట్టుకుని పెద్ద రాద్దాంతం చేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది.. తమిళంలో ఈ మధ్య కాలంలో విడుదలైన జై భీమ్ సినిమా కూడా అదే విధంగా ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ విషయం మీద సూర్య ఎన్ని వివరణలు ఇచ్చినా వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఈ వ్యవహారం మీద కమెడియన్ సంతానం సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే

సద్దు మణిగేలా

సద్దు మణిగేలా

'జై భీమ్' వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా కన్పించడం లేదు. సినిమాలో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఇంటి మీద ఉన్న ఒక క్యాలెండర్ లో తమ సామాజిక వర్గానికి చెందిన చిహ్నం కనిపించడంతో ఒక సామాజిక వర్గానికి కించపరుస్తూ ఉన్నారు అంటూ ఆసామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది రచ్చ చేయడం మొదలుపెట్టారు.. ఈ వివాదం గురించి సూర్య ఎంత చెబుతున్నా అవతలివారు వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

రోజుకొకరు

రోజుకొకరు

ఇదే వివాదం గురించి రోజుకొకరు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉండడంతో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా వివాదం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా 'జై భీమ్' సినిమా కాంట్రవర్సీ మీద తమిళ స్టార్ కమెడియన్ ఇప్పుడు హీరోగా మారిన సంతానం షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సభాపతి సినిమాతో

సభాపతి సినిమాతో

హీరోగా మారిన సంతానం 'సభాపతి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రీతి వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎస్ భాస్కర్, పుగజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.

సరికాదు అంటూ

సరికాదు అంటూ

ఈ మీడియా సమావేశంలో వన్నియార్ కమ్యూనిటీ వ్యవహారం మీద పీఎంకే, సూర్య మధ్య జరుగుతున్న గొడవపై సంతానం ఏమంటారు? అని ఓ విలేఖరి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సంతానం స్పందిస్తూ "ఇతరులను గొప్పగా చూపించేందుకు ఒక వర్గాన్ని చెడుగా చూపించడం సరికాదు" అని ఆయన అన్నారు. అయితే ఆయన ఇటు 'జై భీమ్‌'కు వ్యతిరేకంగా లేదా పిఎంకే పార్టీ న్యాయ పోరాటానికి తన మద్దతు ప్రకటిస్తున్నట్టు మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఈ కామెంట్స్ ను బట్టి చూస్తే ఆయన 'జై భీమ్‌'కు వ్యతిరేకంగానే ఉన్నట్లు భావిస్తున్నారు.

నాకు తెలియదంటూ

నాకు తెలియదంటూ


అయితే సోషల్ మీడియాలో "ఐ స్టాండ్ విత్ సూర్య" హ్యాష్‌ట్యాగ్‌ల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన తన పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏదీ తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సంతానం ఇలా స్పందించడంతో సూర్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Recommended Video

Latest Film Updates : Jai Bhim చిత్రం వివాదం Suriya పై ఆ సంస్థ సంచలన ప్రకటన! || Filmibeat Telugu
హ్యాష్ టాగ్ లు

హ్యాష్ టాగ్ లు


సంతానం సూర్యతో కలిసి 'సిల్లును ఒరు కాదల్', 'సింగం 2' వంటి సినిమాలలో నటించిన ఆయన సూర్యకు మద్దతు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే పిఎంకె నాయకుడు డాక్టర్ ఎస్ రామదాస్ పట్ల సంతానం తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున #SuriyaAgainstVanniyars, #WeStandWithSanthanam అనే హ్యాష్ ట్యాగ్ లను ఆ పార్టీ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X