For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమిడియన్ సరసన 'ప్రేమిస్తే' సంధ్య

    By Srikanya
    |

    చెన్నై: 'ప్రేమిస్తే'తో రివ్వున దూసుకొచ్చిన సంధ్య అనంతరం అవకాశాల రేసులో వెనకబడింది. ప్రస్తుతం శివ, సంతానం హీరోలుగా వస్తున్న 'యాయా'లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. సంతానం సరసన ఆమె నటిస్తోంది. ఆమె అంతకు ముందు పవన్ కళ్యాణ్ కి చెల్లిగా అన్నవరం చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో మరో చిత్రంలో హీరోయిన్ గానూ చేసింది. కానీ ఆమెకు ఏదీ కలిసి రాలేదు.

    సంధ్య మాట్లాడుతూ.. 'యాయా'లో సంతానానికి జంటగా నటిస్తున్నాను. మహిళా పోలీసు కానిస్టేబుల్‌గా కనిపిస్తాను. అవకాశాలు లేకపోవడంతోనే సంతానం సరసన నటించేందుకు అంగీకరించాననే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. కథ విన్నాను. నటనకు అవకాశంఉన్న పాత్ర కావటంతోనే అంగీకరించాను. మలయాళంలో తీరికలేకుండా ఉన్నాను. 'యాయా' పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతోంది. చిత్రానికి పవర్‌స్టార్‌ అదనపు ఆకర్షణ అని చెప్పింది.

    అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన 'సంధ్య' న్యూడ్ గా నటించేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. తమిళంలో దీపన్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'మాజై కాలమ్' అనే చిత్రానికి గాను.... పాత్ర డిమాండ్ మేరకు ఓ సీన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నటించేందుకు ఒప్పుకుందని సమాచారం.

    ఈ సినిమా కథ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, కథలో భాగంగా చిత్రకారుడు వేసే పేయింటింగ్ కోసం ఆమె న్యూడ్ గా ఫోజు ఇవ్వాల్సి వస్తుందని, అందులో భాగంగానే సంధ్య ను అడగ్గా....ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెబుతున్నారు. సంధ్య కంటే ముందు పలువురు పెద్ద హీరోయిన్లను సంప్రదించినా వారు న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరో ప్రక్క ఇదివరకు 'అల్లరే అల్లరి', 'రామ్‌దేవ్' వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్‌కె. బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'. ఈ చిత్రంలోనూ సంధ్య కీలకమైన పాత్రను చేస్తోంది.

    English summary
    "Ya Ya" is the current comedy film Santhanam is working on, among other movies. This film has Shiva in the lead along with Powerstar Srinivasan and Santhanam. "Kadhal" Sandhya hasn't been seen in Tamil films for quite a while now as she shifted her base to Kerala and kept herself busy there. Now, she is back in Kollywood. She is playing the role of Santhanam's better half in "Ya Ya". This movie is to be yet another entertainer where Santhanam and Sandhya have fun picking on Powerstar. We have to wait and see what they have in store for us!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X