Don't Miss!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కమిడియన్ సరసన 'ప్రేమిస్తే' సంధ్య
చెన్నై: 'ప్రేమిస్తే'తో రివ్వున దూసుకొచ్చిన సంధ్య అనంతరం అవకాశాల రేసులో వెనకబడింది. ప్రస్తుతం శివ, సంతానం హీరోలుగా వస్తున్న 'యాయా'లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. సంతానం సరసన ఆమె నటిస్తోంది. ఆమె అంతకు ముందు పవన్ కళ్యాణ్ కి చెల్లిగా అన్నవరం చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో మరో చిత్రంలో హీరోయిన్ గానూ చేసింది. కానీ ఆమెకు ఏదీ కలిసి రాలేదు.
సంధ్య మాట్లాడుతూ.. 'యాయా'లో సంతానానికి జంటగా నటిస్తున్నాను. మహిళా పోలీసు కానిస్టేబుల్‌గా కనిపిస్తాను. అవకాశాలు లేకపోవడంతోనే సంతానం సరసన నటించేందుకు అంగీకరించాననే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. కథ విన్నాను. నటనకు అవకాశంఉన్న పాత్ర కావటంతోనే అంగీకరించాను. మలయాళంలో తీరికలేకుండా ఉన్నాను. 'యాయా' పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతోంది. చిత్రానికి పవర్‌స్టార్ అదనపు ఆకర్షణ అని చెప్పింది.
అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన 'సంధ్య' న్యూడ్ గా నటించేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. తమిళంలో దీపన్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'మాజై కాలమ్' అనే చిత్రానికి గాను.... పాత్ర డిమాండ్ మేరకు ఓ సీన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నటించేందుకు ఒప్పుకుందని సమాచారం.
ఈ సినిమా కథ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, కథలో భాగంగా చిత్రకారుడు వేసే పేయింటింగ్ కోసం ఆమె న్యూడ్ గా ఫోజు ఇవ్వాల్సి వస్తుందని, అందులో భాగంగానే సంధ్య ను అడగ్గా....ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెబుతున్నారు. సంధ్య కంటే ముందు పలువురు పెద్ద హీరోయిన్లను సంప్రదించినా వారు న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరో ప్రక్క ఇదివరకు 'అల్లరే అల్లరి', 'రామ్‌దేవ్' వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్కె. బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'. ఈ చిత్రంలోనూ సంధ్య కీలకమైన పాత్రను చేస్తోంది.