twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్‌స్టార్‌,సంతానం కాంబినేషన్ లో...

    By Srikanya
    |

    పాపులర్ కమిడియన్ సంతానం లేని తమిళ సినిమా ఊహించలేని స్ధితిలో ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యేకంగా సంతానం ఉన్నాడా అని కనుక్కుని మరి సినిమాలు కొనుక్కూంటారు. అలాంటి సంతానం తాజాగా పవర్ స్టార్ చిత్రంలో బుక్కయ్యాడని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదట. తమిళంలోనూ ఓ పవర్ స్టార్ ఉన్నాడట.

    ఈ మధ్య హీరోగా మారిన డాక్టర్ శ్రీనివాసన్‌కు ఆయన అభిమాని ఇచ్చిన బిరుదు పవర్‌స్టార్. డాక్టర్ శ్రీనివాసన్, సంతానం కలిసి నటించనున్న చిత్రానికి కన్నా లడ్డు తిన్న ఆశయా అనే టైటిల్‌ను నిర్ణయించారట. ఈ విషయాన్ని తమిళ మీడియా హైలెట్ చేస్తూ పవర్ స్టార్,సంతానం కాంబినేషన్ అని ప్రస్తావిస్తూ కథనాలు రాసింది. దాంతో తమిళం వాళ్లు కూడా చాలా మంది పొరబడ్డారట. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ కూడా పవర్ స్టార్ గా వారు గుర్తించుకున్నారు.

    ఇక ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ...తాను పవర్‌స్టార్ శ్రీనివాసన్‌తో కలిసి నటించనున్న మాట నిజమేనని స్పష్టం చేశారు. ఈ చిత్రం గురించి చర్చించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం పూర్తి హాస్యభరిత కథాంశంతో తెరకెక్కనుందని, దీని పాటల రికార్డింగ్ త్వరలో ప్రారంభం కానుందని డాక్టర్ శ్రీనివాసన్ వెల్లడించారు.

    English summary
    
 Santhanam, who is the most wanted comedian in K-Town today, is going to team up with Power Star Srinivasan, a doctor-turned-actor who has created a fan following of sorts online. The duo will be teaming up for a comedy that has been titled Kanna Laddu Thinna Aasaiya (KLTA), after the famous catchphrase used in a TV commercial.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X