యువరాణి పాత్రలో అదరకొట్టనున్న జెనీలియా
మొన్న మగధీర చిత్రంలో కాజల్ యువరాణిగా కనిపించి అందరి కలల రాణిగా మారింది. తాజాగా జెనీలియా ని యువరాణిలా చూపించేందుకు ప్రముఖ కెమెరామెన్ సంతోష్ శివన్ సిద్ధమవుతున్నారు. గతంలోనూ టెర్రరిస్ట్ వంటి చిత్రాలు డైరక్ట్ చేసి తనలోని దర్శకుడు పవర్ ఏమిటో చూపించిన సంతోష్ శివన్ తాజాగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. చారిత్రక కథాంశంతో చిత్రాన్ని రూపొందే ఈ చిత్రం పేరు హు కిల్ డ్ వాస్కోడి గామా. పృథ్వీరాజ్ హీరోగా చేసే ఈ చిత్రం 15వ శతాబ్దానికి చెందిన కథతో ముందుకు నడుస్తుంది. వాస్కోడిగామా హత్యతో సినిమా మొదలవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ "చిత్ర నేపథ్యం కొత్తగా ఉంటుంది. చిత్రంలో 'కలరిపయట్టు' అనే యుద్ధ కళకి సంభందించిన చర్చ ఉంటుంది. ఇందులో జెనీలియా పోర్చుగీసు యువరాణిగా కనిపిస్తుంది" అన్నారు. ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది. రావణ్ తర్వాత సంతోష్ శివన్ చేస్తున్న ప్రాజెక్టు ఇదే.


Click it and Unblock the Notifications











