దర్శకుడు, నటుడు భాగ్యరాజా కూతురు శరణ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమెను మంగళవారం ఉదయం చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రేమ విఫలం కావడంతో 23 ఏళ్ల ఆ భామ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. పారిజాతం సినిమా హీరో పృథ్వీరాజ్ తో ఆమె ప్రేమలో పడినట్లు వార్తలొచ్చాయి. అది ఫలించకపోవడంతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగినట్లు చెబుతున్నారు. పారిజాతం సినిమాలో ఆమె హీరోయినుగా నటించింది. పారిజాతం సినిమాను తెలుగులో రీమేక్ చేసి కూతురుని తెలుగు తెరకు పరిచయం చేయాలని భాగ్యరాజా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.
Story first published: Thursday, July 16, 2026, 18:20 [IST]