శరత్ బాబు టార్చర్ భరించలేక భార్య..
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు భార్య స్నేహలతా దీక్షిత్ ..విడాకులు కావాలంటూ చెన్నైలో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు.ఆమె వయస్సు 60 సంవత్సరాలు. ఆమె తన పిటిషన్‌లో.. "ఇప్పుడు నాకు అరవై ఏళ్లు..ఆయన పెట్టే మానసిక హింసను తట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్లని భరిస్తాం.. ఈ మాయదారి భర్తని.. ఎంతో ఓపికగా ఎదురుచూశాను.. ఇక చాలు..ఇంక ఆయనతో వేగలేను. వెంటనే విడాకులు మంజూరు చేయండి'' అని న్యాయమూర్తిని కోరారు. దాంతో న్యాయమూర్తులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో దీంతో భార్యాభర్తలిద్దర్నీ వెంటనే కౌన్సిలింగ్‌కి హాజరుకావాలని మూడో అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శాంతకుమారి ఆదేశాలు జారీచేశారు. 1990, మే 28న శరత్ బాబు, స్నేహలతల వివాహం జరిగింది. ఇద్దరికి ఇది రెండో వివాహమే.
శరత్ బాబు అంతకుముందు సీనియర్ నటీమణి రమాప్రభను వివాహమాడారు. పలు కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇది టాలీవుడ్ లోని సీనియర్స్ అందరూని ఆలోచనలో పడేసింది. శరత్ బాబుతో సినిమాలు చేసిన వారు,ఆయన్ని పర్సనల్ గా ఎరిగిన వారు అంతా ఇదే విషయం చర్చిస్తున్నారు. ఇంతకు ముందు కూడా రమాప్రభ ఇలాంటి ఆరోపణలతోనే విడాకులు తీసుకుంది. ఆ మధ్యన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలోనూ ఇదే విషయం ఆమె వెళ్లడించింది. సినిమా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లంతా ఈ జంట విడాకులను ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. తమ కుటుంబాలలో వివాదాలను ఆ స్ధాయికి రానందుకు సంతోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











