నాని సినిమాలో ...సీబీఐ అధికారిగా శరత్‌కుమార్‌

By Srikanya

చెన్నై : గతంలో శరత్ కుమార్ తెలుగులో గ్యాంగ్ లీడర్,బన్ని, కాంచన వంటి చిత్రాలు చేసి దగ్గర అయ్యారు. మళ్లీ త్వరలో తెలుగులో కనిపించనున్నారు. నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న 'జెండాపై కపిరాజు' చిత్రంలో శరత్ కుమార్ కథను మలుపు తిప్పే సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. విలన్ గా అడుగుపెట్టి హీరోగా మారి విజయాలు సొంతం చేసుకున్న నటుడు శరత్‌కుమార్‌. అన్నిరకాల పాత్రలు పోషించాడు. ఇటీవల విడుదలైన 'చెన్నైయిల్‌ ఒరునాల్‌'లో పోలీసు కమిషనర్‌గా నటించాడు. తాజాగా సీబీఐ అధికారిగా కనిపించనున్నాడు.

సముద్రకని దర్శకత్వంలో జయంరవి ప్రధానపాత్రధారిగా 'నిమిందు నిల్‌' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేఎస్‌ శ్రీనివాసన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శరత్‌కుమార్‌ సీబీఐ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఒకే సమయంలో తెలుగులోనూ తెరకెక్కుతోంది. అందులో నాని హీరో . జీవీ ప్రకాశ్‌ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు వెర్షన్ లోనూ శరత్ కుమార్ కనిపించనున్నారు.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు.

ఇందులో తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X