రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో వరలక్ష్మీ.. ఇద్దరినీ చితక్కొట్టిందని కేసు.. అలా చేయడంతో!
వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ గారాల కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా అంతగా హిట్ కానీ ఈ బొద్దుగుమ్మ నటిగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే తెలుగులో రవితేజ నటించి హిట్ కొట్టిన క్రాక్ సినిమాలో జయమ్మగా పాపులర్ కాగా.. బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిత్రంలో విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే రియల్ లైఫ్ లో తాను హైపర్ యాక్టివ్ అని చెప్పే ఈ ముద్దుగుమ్మ రాత్రి పూట పోలీస్ స్టేషన్ లో ఉందట. ఈ విషయంపై తాజాగా ఆమె తండ్రి శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పెద్దగా కానీ సక్సెస్..
సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినీ రంగంలో కాలు మోపిన వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. పోడాపోడీ సినిమాతో కేరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ విశాల్, శింబు వంటి తదితర మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్గా విజయం సాధించకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.

తెలుగు, తమిళంలో..
హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్గా కొన్ని సినిమాల్లో ఊహించినంత రేంజ్లో రెస్పాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో విలన్ గా ఆకట్టుకుని ఆశ్చర్యపరిచింది. దాదాపు హీరోతో సమానంగా చాలా అద్భుతంగా ఆ పాత్రలో నటించి మెప్పించింది. విశాల్ పందెం కోడి 2 సినిమాలోను విలన్ గా సత్తా చాటింది ఈ బ్యూటిఫుల్. అటు తమిళంలో చేస్తూనే తెలుగులోను నటించింది.

బాలయ్య సినిమాలో..
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ బీఎల్ సినిమాలో నెగెటివ్ రోల్ తో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్ రవితేజ క్రాక్ సినిమాతో ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. నాంది, పక్కా కమర్షియల్, యశోద సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో మరోసారి విలన్ గా నటించి హిట్ కొట్టింది.

ఆసక్తికర విషయాలు..
బ్యూటిఫుల్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం శబరి, వర ఐపీఎస్, హనుమాన్ వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉంది. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ 'కొండ్రాల్ పావమ్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో వరలక్ష్మీ గురించి ఆమె తండ్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ వేదికపై వరలక్ష్మీని విజయశాంతితో పోలుస్తున్నారని, అది నిజమేనని ఆయన అన్నారు.

ధైర్య సాహసాలు గల..
"మొదట్లో వరలక్ష్మీ సినిమాల్లోకి వస్తానంటే సినిమాలు, అదంతా అవసరమా అని నేను అడిగాను. కానీ, వరలక్ష్మీ వినలేదు. సినిమాలు చేయడానికే సిద్ధమైంది. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మాత్రం తన శ్రమే కారణం. నాలాంటి తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా స్వశక్తితో తను పైకి ఎదిగింది. వరలక్ష్మీ చాలా ధైర్యసాహసాలు గల అమ్మాయి" అని వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ తెలిపారు.

ఇద్దరినీ చితకబాదిందని..
ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ గురించి ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు శరత్ కుమార్. "ఓసారి నాకు రాత్రి సమయంలో మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందంటూ కాల్ వచ్చింది. ఆమె ఇద్దరి అబ్బాయిలను కొట్టినట్లు తెలిసిందని వారు చెప్పారు. అయితే వారు అంతకుముందు తన కారును ఢీ కొట్టడమే కాకుండా అల్లరి చేశారట. దీంతో ఆ ఇద్దరినీ వరలక్ష్మీ చితకబాదిందని వారు చెప్పారు. చిన్నప్పటి నుంచి వరలక్ష్మీ ధైర్యశాలి" అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











