twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను క్షమించండి, అమ్మాయిల విషయంలో తప్పు చేశా: బిగ్ బాస్ 3 కంటెస్టెంట్

    |

    తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంటుగా ఉన్న నటుడు శరవణన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాలేజీ రోజుల్లో తాను అమ్మాయిలను ఏడిపించడానికి సిటీ బస్సు ఎక్కేవాడిని, వారిని అక్కడ ఇక్కడ తాకుతూ ఆట పట్టించే వాడిని అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

    అయితే బిగ్ బాస్ షోలో శరవణన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సమయంలో కమల్ హాసన్‌తో పాటు షోలో ఆడియన్స్ కూడా చప్పట్లు కొడుతూ అతడు చేసిన చర్యలను సమర్ధించడంపై విమర్శలు వచ్చాయి. సింగర్ చిన్మయితో పాటు మరికొందరు స్త్రీ వాదులు.... ఇలాంటి వ్యాఖ్యలు, చర్యలను తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. ఈ వివాదం ముదురుతుండటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు శరవణన్‌తో హౌస్ నుంచే క్షమాపణలు చెప్పించారు.

    Saravanan has apologized for his comments about women in Bigg Boss Tamil 3

    'బిగ్ బాస్ షో చూస్తున్న వారికి ఓ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ రోజు కమల్ సర్ ఆ ప్రశ్న అడిగినపుడు నేను కాలేజీ రోజుల్లో చేసిన పనుల గురించి చెప్పాను. అప్పట్లో నేను చేసింది పూర్తిగా తప్పే. అలాంటి పనులు ఎవరూ చేయకూడదు అని చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేక పోయాను. మహిళలకు మనం గౌరవం ఇవ్వాలి, యువత దయచేసి నేను చేసినట్లు చెడ్డ పనులు చేయకూడదని కోరుకుంటున్నాను' అని శరవణన్ తెలిపారు.

    బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఈ విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాలేజీ రోజుల్లో నేను చేసింది ముమ్మాటికీ తప్పే. అలాంటి పనులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. నా మాటలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించాలని శరవణన్ తెలిపారు.

    కాగా... వివాదాలకు కేంద్ర బింధువుగా ఉన్న బిగ్ బాస్ షోను రద్దు చేయాలని తమిళనాడులోని పలువురు పొలిటీషియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి షో వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Tamil actor Saravanan has apologized for his comments about women in Bigg Boss Tamil 3. Women should be treated with respect. If harassing women, they will be punished. He said he apologized for the harassment of girls on city buses during college days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X