twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కార్’ సెగ: అరెస్ట్ కాకుండా మురుగదాస్ బెయిల్ పిటీషన్

    |

    తమిళ స్టార్ విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' చిత్రం ఓ వైపు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే... మరో వైపు వివాదాలు అదే స్థాయిలో రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో మురుగదాస్ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హై కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది.

    Recommended Video

    Director AR Murudadoss Faces A Severe Opposition From TN Government | Filmibeat Telugu

    సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    మురుగదాస్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందంటూ గురువారం రాత్రి నుంచే ప్రచారం జరుగుతోంది. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకే పోలీసులు ఆయన ఇంటికి వెళుతున్నారని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేయడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

     అరెస్ట్ కోసం కాదు, రక్షణ కల్పించడానికే

    అరెస్ట్ కోసం కాదు, రక్షణ కల్పించడానికే

    అయితే మురుగదాస్ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశ్యం తమకు లేదని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు మురుగదాస్ కూడా ఈ విషయంపై స్పందించారు. పోలీసులు తన ఇంటికి వచ్చింది అరెస్టు చేయడానికి కాదని, రక్షణ కల్పించడానికే అని తెలిపారు.

    మురుగదాస్ ముందస్తు బెయిల్ పిటీషన్

    మురుగదాస్ ముందస్తు బెయిల్ పిటీషన్

    అరెస్ట్ లాంటిదేమీ లేదంటూ.... మురుగదాస్ యాంటిసిపెటరీ బెయిల్ కోసం మద్రాస్ హై కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది. శుక్రవారం మధ్నాహం తర్వాత ఈ కేసు విచారణకు రానుంది. అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నందునే బెయిల్ కోసం అప్లై చేసినట్లు చర్చించుకుంటున్నారు.

    కారణం ఆ సీన్లే

    కారణం ఆ సీన్లే

    కాగా... ఈ వివాదాలన్నింటికీ కారణం ఈ సినిమాలోని కొన్ని సీన్లే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

    సీన్లు తొలగించడానికి సిద్ధంగా లేరా?

    సీన్లు తొలగించడానికి సిద్ధంగా లేరా?

    ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సన్ పిక్చర్స్ సంస్థ అన్నా డీఎంకె నేతలతో చర్చలు జరిపింది. అభ్యంతరకర సీన్లను తొలగించడానికి అంగీకరించింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, మురుగదాస్ బెయిల్ కోసం పిటీషన్ వేయడం చూస్తుంటే..... సీన్లు తొలించే విషయంలో సన్ పిక్చర్స్ సంస్థ సిద్ధంగా లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Sarkar movie director Murugadoss has filed a petition with the Madras High Court seeking anticipatory bail. According to sources, the petition will be heard at the court today afternoon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X